సక్సెస్ పార్టీలో ఊర్వశితో NBK మళ్లీ దబిడి దిబిడి
ఇప్పుడు సక్సెస్ పార్టీలోను దబిడి దిబిడికి బాలయ్య బాబు మళ్లీ ఊర్వశి రౌతేలాతో కలిసి డ్యాన్సులు చేసారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది.
ఈ సంక్రాంతి బరిలో నటసింహా నందమూరి బాలకృష్ణ నటించిన `డాకు మహారాజ్` ఇతర భారీ చిత్రాలతో పోటీపడుతూ రిలీజైన సంగతి తెలిసిందే. బాబి కొల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇంతకుముందు ప్రచార వేదికపై ఊర్వశి రౌతేలాతో కలిసి ఎన్బీకే `దబిడి దిబిడి` పాటకు నృత్యం చేసారు. ఊర్వశి స్పెషల్ స్టెప్పులకు బాలయ్య బాబు ఎనర్జిటిక్ ఊప్స్ కలిసొచ్చి ఈ వీడియో వైరల్ అయింది. నెటిజనులు రకరకాల కామెంట్లు చేసినా కానీ, బాలయ్యలోని ఉత్సాహం అందరినీ ఆకట్టుకుంది.
ఇప్పుడు సక్సెస్ పార్టీలోను దబిడి దిబిడికి బాలయ్య బాబు మళ్లీ ఊర్వశి రౌతేలాతో కలిసి డ్యాన్సులు చేసారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా `డాకు మహారాజ్` విజయాన్ని ఆస్వాధిస్తున్నారు. సోమవారం ఊర్వశి ఇన్‌స్టాలో సక్సెస్ పార్టీ నుండి ఒక వీడియోను స్వయంగా షేర్ చేసారు. పార్టీలో ఊర్వశి రౌతేలా రోజ్ గోల్డ్ చీరలో అబ్బురపరచగా, నందమూరి బాలకృష్ణ డెనిమ్ ప్యాంటు- నీలిరంగు శాటిన్ చొక్కాలో తళుక్కున మెరిసారు. డాకు విజయోత్సవ వేడుకలో కేక్ లు కట్ చేసి చిత్రబృందం సంబరాలు చేసుకుంది. `ఇది దబిడి దిబిడి సక్సెస్ పార్టీ` అంటూ టీమ్ ఉత్సాహం ప్రదర్శించింది. దబిడి దిబిడి వీడియో సాంగ్‌కి 2 కోట్ల (20 మిలియన్) వ్యూస్ వచ్చాయని టీమ్ వెల్లడించింది.
అలాగే ఈ సక్సెస్ నేపథ్యంలో ఊర్వశి రౌతేలా దర్శకుడు బాబీ కొల్లికి బహిరంగ లేఖ కూడా రాశారు. ఆ లేఖలో వాల్తేరు వీరయ్య నుండి డాకు మహారాజ్ వరకు కలిసి చేసిన ప్రయాణంపై ఉద్వేగంగా స్పందించింది. వాల్తేరు వీరయ్యలో బాస్ పార్టీతో ప్రారంభమైన మన ప్రయాణం మాయాజాలం కంటే తక్కువ కాదు. ఆ ప్రాజెక్ట్ సమయంలో నా సామర్థ్యాలపై మీరు చూపిన నమ్మకం నా హృదయాన్ని తాకింది. ఆ అనుభవం మీ ప్రతిభ, అభిరుచి, కెప్టెన్సీ నన్ను ఆశ్చర్యపరిచింది అని ఊర్వశి ఉబ్బితబ్బిబ్బయింది. డాకు మహారాజ్ లోని ప్రతి డీటెయిలింగ్ లో ఆత్మను కుమ్మరించారు. గత రెండు సంవత్సరాలుగా మీ అవిశ్రాంతమైన అంకితభావం, అచంచలమైన దృష్టి ఈ జనరేషన్ గొప్ప దర్శకులలో ఒకరిగా మిమ్మల్ని మీలో ప్రతిభను నేను చూశాను`` అని ఎమోషనల్ నోట్ రాసింది ఊర్వశి.
కలను లైఫ్ గా మార్చారని కూడా ఊర్వశి తన దర్శకుడు బాబీని ప్రశంసల్లో ముంచెత్తింది. డాకు మహారాజ్‌లో బాబీ డియోల్ విలన్‌గా నటించారు. ప్రగ్యా జైస్వాల్, చాందిని చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ కీలక పాత్రలు పోషించారు. ఈ భారీ చిత్రాన్ని సూర్యదేవర నాగ వంశీ - సాయి సౌజన్య నిర్మించారు.