మరోసారి హిట్ కాంబో రిపీట్!
నందమూరి బాలకృష్ణ ఇప్పుడేం చేసినా సక్సెస్ తో పాటూ సెన్సేషన్ అవుతుంది. ఓ వైపు హీరోగా వరుస సక్సెస్‌లు అందుకుంటున్న బాలకృష్ణ మరోవైపు రాజకీయ నాయకుడిగా కూడా అంతే సక్సెస్ అవుతున్నారు.;

నందమూరి బాలకృష్ణ ఇప్పుడేం చేసినా సక్సెస్ తో పాటూ సెన్సేషన్ అవుతుంది. ఓ వైపు హీరోగా వరుస సక్సెస్‌లు అందుకుంటున్న బాలకృష్ణ మరోవైపు రాజకీయ నాయకుడిగా కూడా అంతే సక్సెస్ అవుతున్నారు. ఇంకోవైపు టాక్ షో కు హోస్ట్ గా వ్యవహరించి ఆ బాధ్యతను కూడా సక్సెస్‌ఫుల్ గా నిర్వర్తించి ఫ్యాన్స్ కు ఫుల్ ట్రీట్ ఇస్తున్నారు బాలయ్య.
ఈ ఏడాది ఇప్పటికే డాకు మహారాజ్ సినిమాతో మంచి సక్సెస్‌ను అందుకున్న బాలకృష్ణ ఇప్పుడు బోయపాటి శ్రీనుతో కలిసి అఖండ2 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అఖండ2 కు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. బ్లాక్ బస్టర్ అఖండకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య రెండు గెటప్స్ లో కనిపించనున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం అఖండ2 తో బిజీగా ఉన్న బాలయ్య, మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మాస్ సినిమాలకు పెట్టింది పేరైన బాలయ్య ఇప్పుడు మరోసారి అదే దారిలో వెళ్లనున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే తనకు వీర సింహారెడ్డి లాంటి హిట్ సినిమాను ఇచ్చిన డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి బాలయ్య కమిట్ అయినట్టు తెలుస్తోంది.
ఇప్పటికే ఇద్దరి మధ్య డిస్కషన్స్ కూడా జరిగాయని, బాలయ్య బర్త్ డే సందర్భంగా జూన్ 10వ తేదీన ఈ సినిమాను అనౌన్స్ చేయనున్నట్టు సమాచారం. క్రాక్, వీర సింహారెడ్డి సినిమాల సక్సెస్ తర్వాత ఏకంగా బాలీవుడ్ కు వెళ్లి అక్కడి హీరో సన్నీ డియోల్ తో జాట్ సినిమా తీసి సక్సెస్ అందుకున్న గోపీచంద్ మలినేని ఇప్పుడు మళ్లీ బాలయ్యతో సినిమా తీయడానికి రెడీ అయ్యాడు.
ఈ సినిమాను వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు భారీ బడ్జెట్ తో నిర్మించనున్నట్టు తెలుస్తోంది. ఆల్రెడీ వృద్ధి సినిమాస్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రూపొందుతున్న పెద్ది అనే సినిమాను నిర్మిస్తోండగా, ఇప్పుడు రెండో సినిమాగా బాలయ్య- గోపీచంద్ మలినేని సినిమాను నిర్మించనుంది. వీర సింహారెడ్డి తర్వాత బాలయ్య- గోపీచంద్ కలయికలో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడే అవకాశముంది.