బాలయ్య అన్‌స్టాపబుల్ - ఈసారి అంతకుమించి..

నందమూరి బాలకృష్ణ ఆరు పదుల వయసులో కూడా చాలా చురుగ్గా వర్క్ చేస్తూ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు.

Update: 2024-08-07 09:24 GMT

నందమూరి బాలకృష్ణ ఆరు పదుల వయసులో కూడా చాలా చురుగ్గా వర్క్ చేస్తూ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు. వయసు ఎంత పెరుగుతున్నా కూడా ఆ కటౌట్ లో మాస్ వేడి మాత్రం అస్సలు తగ్గడం లేదు. ప్రస్తుతం ఆయన తీరిక లేకుండా షూటింగ్స్ లో బిజీబిజీగా ఉంటున్నారు. ‘NBK109’ మాస్ ఎంటర్‌టైనర్‌గా బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా 2024 చివర్లో లేదా 2025 ప్రారంభంలో విడుదలకు కానుంది.

అయితే ఈ సినిమా షెడ్యూల్‌కి మధ్యలో బాలయ్య మరోసారి తన అభిమానులని అన్‌స్టాపబుల్ టాక్‌షో ద్వారా ఎంటర్‌టైన్‌ చెయ్యడానికి రెడీ అవుతున్నారు. ‘అన్‌స్టాపబుల్’ టాక్‌షో తెలుగు ప్రేక్షకులను విశేషంగా అలరించింది. ఇప్పటికే విడుదలైన రెండు సీజన్లు భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఆహా ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులో ఉన్న ఈ షో కొత్త సీజన్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈసారి అంతకుమించి అనేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా చిరంజీవి కూడా స్పెషల్ గెస్ట్ గా రాబోతున్నట్లు తెలుస్తోంది. నాగార్జున కూడా రానున్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. నెవ్వర్ బిఫోర్ అనేలా ప్లాన్ చేస్తున్నట్లు టాక్ అయితే వస్తోంది. తాజా సమాచారం ప్రకారం, మూడవ సీజన్‌కి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి, సెప్టెంబర్ మధ్యలో షూటింగ్ ప్రారంభమవుతుందట.

దసరా పండగ సీజన్‌లో మొదటి ఎపిసోడ్ ప్రసారం కానుందని, ఈ సీజన్ డిసెంబర్ వరకు కొనసాగనున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే, బాలకృష్ణ బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘NBK109’ షూటింగ్‌ కూడా పూర్తి చేయనున్నారు. అటుపైన, బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ’కి సీక్వెల్‌గా తెరకెక్కబోయే సినిమా షూటింగ్‌కి కూడా సిద్ధమవుతున్నారు.

ఈ సినిమా దసరా తర్వాత ప్రారంభం కానుంది. 14 రీల్స్ ప్లస్ సంస్థ ఈ భారీ చిత్రాన్ని నిర్మించనుంది. అంతేకాకుండా, బాలయ్య తన కుమారుడు మోక్షజ్ఞ తొలి చిత్రంలో కూడా ఒక పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారని ఊహాగానాలు వస్తున్నాయి. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించబోయే ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 6న గ్రాండ్‌గా ప్రారంభించి, రెగ్యులర్ షూట్‌ను వెంటనే ప్రారంభించనున్నట్లు సమాచారం. దీన్ని బట్టి రాబోయే రోజుల్లో బాలయ్య ఫ్యాన్స్ కు బ్యాక్ టూ బ్యాక్ విజిల్స్ వేసే అప్డేట్స్ అందుతాయని చెప్పవచ్చు. జై బాలయ్య నినాదాలు మరింత హై వోల్టేజ్ తో మారుమ్రోగే అవకాశం అయితే ఉంది.

Tags:    

Similar News