బాలయ్య యాక్షన్ దిమ్మతిరిగి బొమ్మ కనిపించేలా!
బాలయ్య తెరపై ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాడా? అని ఆయన అభిమానులంతా ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు.
నటసింహ బాలకృష్ణ కథానాయకుడిగా బాబి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'డాకు మహారాజ్' భారీ అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే. రిలీజ్ కౌంట్ డౌన్ మొదలైపోయింది. ఇప్పటికే ప్రచార చిత్రాలతో అంచనాలు పీక్స్ కి చేరాయి. బాలయ్య తెరపై ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాడా? అని ఆయన అభిమానులంతా ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు.
పైగా ఈసారి యాక్షన్ మేకర్ బాబి తోడవ్వడంతో? ఆ యాక్షన్ ఏ స్థాయిలో ఉంటుందో కూడా ఊహకి అందండం లేదంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ అంచనాలు సంచలనాలు అయ్యేలా బాబి మరో బాంబ్ పేల్చాడు. సినిమాలో బాలయ్య పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుదన్నారు. చూడటానికి సైలెంట్ గా ఉన్నట్లు కనిపించినా? డైన మైట్ పేలితో ఎంత విధ్వంసం జరుగుతుందో అంతకు రెట్టింపు విధ్వంసం బాలయ్య పాత్రలో ఉంటుందన్నారు.
పరిస్థితుల్ని బట్టి బాలయ్య పాత్ర తీరు మారడం షాకింగ్ గా ఉంటుందన్నారు. యాక్షన్ సన్నివేశాలు నెక్స్ట్ లెవల్లో ఉంటాయన్నారు. బాలయ్యపై వచ్చే పోరాట ఘట్టాలు ఏమాత్రం ఊహకి అందని విధంగా ఉంటాయన్నారు. ఇంకా చెప్పాలంటే హాలీవుడ్ ‘జాన్ విక్’ సిరీస్ తరహా యాక్షన్ బాలయ్య పాత్రలో కనిపిస్తుందన్నారు. ఈ మాటతో అంచనాలు ఇంకా పెరిగిపోతున్నాయి. బేసిక్ గా బాలయ్యలో యాక్షన్ హైలైట్.
దాన్ని చూపించడంలో బోయపాటి మాత్రమే ఇంత వరకూ స్పెషలిస్ట్ గా కనిపించారు. కానీ బాబి మాటల్ని బట్టి చూస్తుంటే బోయపాటినే మించిపోయేలా ఉన్నాడు. మరి ఆ సంగతేంటో తేలాలంటే జనవరి 12వరకూ వెయిట్ చేయాలి. బాబి గత సినిమా 'వాల్తేరు వీరయ్య' భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే.