అఖండ 2 - రంగంలోకి ఆది పినిశెట్టి.. పవర్ఫుల్ రోల్!

మొదటి భాగం ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే.

Update: 2025-02-08 11:57 GMT

నందమూరి బాలకృష్ణ కెరీర్ సక్సెస్ ఫుల్ ట్రాక్ లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. వరుసగా నాలుగు భారీ బ్లాక్‌బస్టర్లను అందుకున్న NBK ఇప్పుడు ‘అఖండ 2’తో మాస్ ప్రేక్షకులకు మరో సూపర్ థ్రిల్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న ఈ సీక్వెల్‌ ఫస్ట్ పార్ట్ కంటే హై రేంజ్ లో ఉండాలని మేకర్స్ భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే మాస్ ప్రేక్షకుల్లో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదటి భాగం ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. దీంతో ‘అఖండ 2’పై అంచనాలు మరింతగా పెరిగాయి.

ఈ సీక్వెల్‌లో బాలకృష్ణ పాత్ర మరింత పవర్‌ఫుల్‌గా ఉండబోతోందని చిత్రబృందం చెబుతోంది. ఇక బోయపాటి శ్రీను బాలకృష్ణ కోసం భారీ స్థాయిలో యాక్షన్ ఎపిసోడ్లను డిజైన్ చేసినట్టు సమాచారం. అఖండ తొలి భాగం ఎలా మాస్ ఆడియన్స్‌ను ఉర్రూతలూగించిందో, ఈ సినిమా ఆ స్థాయిని మించి వెళ్లనుందని మేకర్స్ ధీమాగా చెబుతున్నారు. అలాగే, సినిమాకు మ్యూజిక్ అందిస్తున్న తమన్ మరోసారి తన బాణీలతో ఉర్రూతలూగించేందుకు రెడీ అవుతున్నాడు.

తాజా అప్‌డేట్ ప్రకారం, ఈ భారీ చిత్రంలో టాలెంటెడ్ నటుడు ఆది పినిశెట్టి కూడా భాగం కాబోతున్నాడు. ఆయన పాత్రకు ప్రత్యేకంగా డిజైన్ చేసిన డైలాగ్స్, యాక్షన్ సీన్స్ సినిమాలో హైలైట్ కానున్నాయి. గతంలో ‘సరైనోడు’ చిత్రంలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో అద్భుతమైన విలన్ పాత్ర పోషించిన ఆది, ఇప్పుడు ‘అఖండ 2’లో మరో సెన్సేషనల్ క్యారెక్టర్‌తో ప్రేక్షకులను మెప్పించనున్నాడు.

బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో ఇప్పటికే ఎన్నో మాస్ బ్లాక్‌బస్టర్లు వచ్చాయి. ఇప్పుడు ఆది లాంటి పవర్ఫుల్ నటుడు ఈ కాంబినేషన్‌లో జాయిన్ కావడంతో, సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ప్రస్తుతం ‘అఖండ 2’ చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. హైదరాబాదులోని అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్ స్టూడియోలో భారీ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నారు. ఈ సీన్స్ కోసం ప్రత్యేకంగా భారీ స్థాయి సెట్స్‌ను కూడా నిర్మించారని సమాచారం.

ముఖ్యంగా బాలకృష్ణ పవర్‌ఫుల్ పాత్రకు తగ్గట్టుగా అన్ని యాక్షన్ ఎపిసోడ్స్ కూడా గట్టిగా ఉండేలా ప్లాన్ చేశారు. సినిమాలో హీరోయిన్‌గా సమ్యుక్త నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని గోపీ ఆచంట, రామ్ ఆచంట పాన్-ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. నందమూరి తేజస్విని సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. సెప్టెంబర్ 25న అఖండ 2 సినిమా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

ఇప్పటికే వచ్చిన అప్‌డేట్‌లను బట్టి చూస్తే, ‘అఖండ 2’ బాలకృష్ణ కెరీర్‌లో మరో భారీ మాస్ ఎంటర్‌టైనర్‌గా నిలిచే అవకాశం ఉందని చెప్పొచ్చు. బోయపాటి శ్రీను ఎప్పటికప్పుడు సినిమాపై క్రేజ్ పెంచేలా అన్ని అప్‌డేట్స్ కూడా ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఆది పినిశెట్టి లాంటి టాలెంటెడ్ నటుడు విలన్ రోల్‌లో అదరగొట్టడం ఖాయమని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సీక్వెల్ మునుపటి రికార్డులను బ్రేక్ చేసి, బాక్సాఫీస్‌పై సునామీ సృష్టించనుందని అభిమానులు నమ్మకంగా ఉన్నారు.

Tags:    

Similar News