అన్‌స్టాపబుల్ సీజన్ 4: బాలయ్య న్యూ అవతార్

Update: 2024-10-12 16:56 GMT

ప్రముఖ ఆహా ఓటీటీ యాప్లో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న "అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే" షోకు ఏ స్థాయిలో క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే మూడు సీజన్స్ విజయవంతంగా కొనసాగాయి. ఇక సీజన్ 4 ప్రారంభం సందర్భంగా ఒక ప్రత్యేకమైన ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ సూపర్ హీరో లుక్ లో ఉండడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది.

ఈ కార్యక్రమం మొదట రతన్ టాటా గారికి నివాళిగా రెండు నిమిషాల మౌనం పాటించడం జరిగింది. ఆ తర్వాత ప్రముఖులు, వారి మాటలతో ఈ కొత్త సీజన్ పై వారి అభిప్రాయాలను పంచుకున్నారు. ఆహా చీఫ్ అలోకనంద సర్, డైరెక్టర్ అనిల్ రావిపూడి, నందమూరి తేజస్విని, మరియు గ్రీన్ గోల్డ్ యానిమేషన్ వ్యవస్థాపకుడు రాజీవ్ చిలకా ఈ కార్యక్రమంలో పాల్గొని తమ తమ అనుభవాలను వెల్లడించారు.


ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ గారి 50 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. బాలయ్య బాబు తన నటనతో, ప్రేక్షకులకు ఇచ్చిన ప్రత్యేక అనుభవాలు ఎన్నో ఉన్నాయి, సూపర్ హీరో పాత్రల్లో నటించడమే కాదు, నిజజీవితంలో కూడా హీరోలా ఎలా నిలిచారో వివరించారు. అభిమానులతో తనను మరింతగా కట్టిపడేసుకున్న బాలకృష్ణ గారు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునే వ్యక్తిత్వం కలిగి ఉన్నారు.

ఈ ఈవెంట్ లో తేజస్విని బాలకృష్ణను సీజన్ 4 ప్రోమోను లాంచ్ చేయాలని ఆహ్వానించారు. ప్రోమోలో బాలకృష్ణ సూపర్ హీరో లుక్ లో కనిపించారు. ఈ సీజన్ లో ఎలాంటి వినూత్నమైన కంటెంట్ ఉండబోతుందనే విషయంపై బాలకృష్ణ మీడియాతో చర్చించారు. గ్రీన్ గోల్డ్ యానిమేషన్ వ్యవస్థాపకుడు రాజీవ్ చిలకా, ఈ ప్రాజెక్ట్ ఎంతో ప్రత్యేకమైనదని, వారి స్టూడియోకు ఇదొక గొప్ప మైలురాయి అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సీజన్ 4 సెట్ డిజైన్ పై ఒక ప్రత్యేక ప్రదర్శన కూడా జరిగింది. బాలకృష్ణ సూపర్ హీరో అవతారంలో కనిపించే కొత్త ప్రోమోను కూడా ప్రేక్షకులకు చూపించారు. ఈ ప్రోమోలో బాలకృష్ణ ఎనర్జిటిక్ లుక్ తో దూసుకువస్తూ అభిమానులని కట్టిపడేస్తారు. జేక్స్ బీజాయ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మరింత రక్తికట్టించింది.

కార్యక్రమం చివర్లో ఒక ప్రత్యేకమైన వోటు ఆఫ్ థాంక్స్ తో ముగిసింది. అభిమానులు మరియు ప్రేక్షకులు అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే సీజన్ 4 ని ఆహా ఓటీటీలో ఎగ్జ్లూజివ్‌గా చూసేందుకు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సీజన్ వినోదంతో పాటు సర్‌ప్రైజ్ లతో నిండుగా ఉండబోతోందని మేకర్స్ హామీ ఇచ్చారు. అలాగే స్పెషల్ గెస్ట్ లతో నెవ్వర్ బిఫోర్ అనేలా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News