'డాకు మహారాజ్'... ఇది ఊహించలేదు!
సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఉన్నప్పటికీ ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు నమోదు అయ్యాయి.
బాలకృష్ణ కెరీర్‌లో ఎప్పుడూ లేనంత పీక్స్‌లో ఉన్నారు. అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకున్నారు. మరో విజయం సాధ్యమేనా అనుకుంటున్న సమయంలో డాకు మహారాజ్ సినిమాతో మొన్న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఉన్నప్పటికీ ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు నమోదు అయ్యాయి. రూ.150 కోట్లకు మించి వసూళ్లు రాబట్టిన డాకు మహారాజ్ సినిమా ఓటీటీలో ప్రస్తుతం సెన్షేషన్ క్రియేట్ చేస్తుంది. థియేట్రికల్ రన్‌లో హిట్ అయితే ఓటీటీలో బ్లాక్‌బస్టర్ విజయాన్ని నమోదు చేసింది.
సాధారణంగా సౌత్ సినిమాలు ఓటీటీలో హిందీతో పాటు ఇతర భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతాయి. ఈమధ్య మన తెలుగు సినిమాలకు హిందీలో మంచి మార్కెట్ ఉంది. నెట్‌ఫ్లిక్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన డాకు మహారాజ్ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇండియాలో నాన్ ఇంగ్లీష్ కేటగిరీలో నెం.1 స్థానంలో నిలిచింది. వరుసగా రెండో వారంలోనూ నెం.1 స్థానం నిలవడంతో పాటు ఇతర దేశాల్లోనూ సినిమా టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ముఖ్యంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఖతార్, యూఏఈ, బహ్రేన్, మల్దీవులు దేశాల్లో సినిమా నెం.1 స్థానంలో ట్రెండ్ అవుతుంది. ఆ దేశాల్లో బాలకృష్ణ వీర విజృంభనను తెగ ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
కేవలం బాలకృష్ణ యొక్క యాక్షన్ సన్నివేశాలు మాత్రమే కాకుండా బాబీ డియోల్ స్టైలిష్ లుక్, ఆయన విలనిజం, ప్రగ్యా జైస్వాల్ అందం మరీ ముఖ్యంగా ఊర్వశి రౌతేలాతో బాలయ్య బాబు దబిడి దిబిడి సాంగ్ కారణంగా అన్ని దేశాల్లోనూ కుమ్మేస్తుంది. సినిమా కొన్ని దేశాల్లో నెం.1 స్థానంలో ట్రెండ్ అవుతూ ఉంటే మరి కొన్ని దేశాల్లో టాప్ 10 లో ట్రెండ్ అవుతుంది. నెట్‌ఫ్లిక్స్ ద్వారా డాకు మహారాజ్ సినిమాకు ఈ స్థాయి మేకర్స్ సైతం ఊహించి ఉండరు. సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో దక్కించుకున్న స్పందన చూసి బాలయ్య అభిమానులు సైతం షాక్ అవుతున్నారు. పాక్, బంగ్లాలో ట్రెండ్ కావడం ఏంటి భయ్యా అంటూ నోరు వెళ్లబెడుతున్నారను.
బాలకృష్ణ ఈ సినిమాలో మూడు విభిన్నమైన గెటప్స్‌లో కనిపించాడు. బాబీ ఈ సినిమా కి ఇప్పటికే ప్రీక్వెల్ చేయబోతున్నట్లు ప్రకటించాడు. నిర్మాత నాగవంశీ ఈ సినిమాను ప్రమోట్ చేసిన తీరు, దర్శకుడు బాబీ ఈ సినిమాను రూపొందించిన తీరు ప్రతి ఒక్కరికీ నచ్చే విధంగా ఉంది. ఇక తమన్ సంగీతం గురించి ఎంత చెప్పినా తక్కువే. బాలకృష్ణ సినిమా అంటే తమన్‌కి పూనకం వస్తుందా, ఆయనలో మరేదైనా శక్తి ఆవహిస్తుంది అన్నట్లుగా బీజీఎం వాయిస్తున్నాడు అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరి కాంబోలో అఖండ 2 సినిమా రూపొందుతోంది. అఖండ 2 కోసం తమన్ బీజీఎం కోసం అంతా వెయిట్ చేస్తున్నారు.