దర్శకుడు త్రివిక్రమ్ కి బండ్ల గణేష్ క్షమాపణలు!
నటుడు, నిర్మాత బండ్ల గణేష్ దర్శకుడు త్రివిక్రమ్ కి క్షమాపణలు తెలియజేసారు.
నటుడు, నిర్మాత బండ్ల గణేష్ దర్శకుడు త్రివిక్రమ్ కి క్షమాపణలు తెలియజేసారు. ఓ అభిమాని ఫోన్ చేసినప్పుడు ఏదో మూడ్ లో ఉండి ఆయన గురించి నోరు జారి వ్యాఖ్యలు చేసానని `గబ్బర్ సింగ్ `రీ-రిలీజ్ సందర్భంగా అన్నారు. `తీన్ మార్` సరిగ్గా ఆడకపోతే నిరాశలో ఉన్నప్పుడు పవన ఫోన్ చేసి పిలిచి `గబ్బర్ సింగ్` చేయమన్నారు. అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అడగగా పాత జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయారు.
`తీన్ మార్` హిట్ అవుతుందనుకున్నా. మనసును హత్తుకునే భావోద్వేగాలు అందులో ఉన్నాయి. చిన్న చిన్ని సమస్యల వల్ల అది మిస్ ఫైర్ అయింది. ఈ సినిమా ప్లాప్ తో బాధలో ఉన్నప్పుడు హీరోతో మాట్లాడి అవకాశం గురించి చెప్పింది త్రివిక్రమ్ గారే. అందుకే ఆయనకు ధన్యవాదాలు. ఒక అభిమాని ఫోన్ చేసినప్పుడు ఏదో మూడ్ లో ఉండి కాస్త నోరు జారాను. అది తప్పు అనిపించింది.
తర్వాత ఇద్దరం కలిసి మాట్లాడుకున్నాం. ఈ సందర్భంగా ఆయనకు క్షమాపణలు చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది. `తీన్ మార్` ని కూడా అద్భుతంగా చేసి రీ-రిలీజ్ చేస్తా. ప్లాప్ అయిన సినిమాని కూడా రీ-రిలీజ్ చేసి హిట్ కొట్టాలన్నది నా కోరిక అన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ ని అభిమానించే మీరు ఓ సందర్భంలో తక్కువ చేసి మాట్లాడారు. ఎందుకు అని ప్రశ్నించగా...గణేష్ ప్రాణం పోయినా ఆ పని చేయడు.
అధికారంలో ఉన్నప్పుడు ఒకలా..లేనప్పుడు మరోలా ఊసరవెల్లిలా రంగులు మార్చే రకం కాదు నేను. నా మనసుకు నచ్చకపోతే దేవుడినైనా ఎదురిస్తా. నచ్చితే వాళ్ల కాళ్లు పట్టుకుంటాను. అది నా స్వభావం. కొన్నాళ్లగా కాంగ్రెస్ కార్యకర్తని. రాజకీయాల్లో ఉంటే కాంగ్రెస్ లోనే ఉంటా. నా కలలో కూడా పవన్ ని విమర్శించను. నా ఇంట్లో..నా బెడ్ రూమ్ లో ఆయన ఫోటో ఉంటుంది` అని అన్నారు.