థియేట‌ర్లో విచిత్రం..ఒకేసారి రెండు సినిమాలు చూపించారు!

ఓపెన్ హైమ‌ర్ థియేట‌ర్ లో బార్బీ సబ్ టైటిల్స్ క‌నిపించ‌డం బిగ్ ట్విస్ట్.

Update: 2023-07-24 13:50 GMT

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన రెండు ఇంగ్లీష్ సినిమాలు ఒకే రోజు విడుదలయ్యాయి. క్రిస్టోఫర్ నోలన్ 'ఓపెన్‌హైమర్'.. గ్రేటా గెర్విగ్ 'బార్బీ' జూలై 21(శుక్రవారం)న‌ థియేటర్లలోకి వచ్చాయి. రెండు చిత్రాలూ శైలులు, కథనం నేప‌థ్యం ప్ర‌తిదీ పూర్తిగా భిన్నంగా ఉండటంతో ప్రేక్ష‌కుల్లో చాలా ఉల్లాసం క‌నిపించింది. ఈ రెండు సినిమాల విష‌యం లో నెటిజన్లు బెస్ట్ మీమ్స్ చేస్తూ సరదాగా గడిపారు.

బార్బెన్‌హైమర్ జోకులు సోషల్ మీడియా లో కొంతకాలంగా ట్రెండింగ్‌ లో ఉన్నాయి. చ‌క్క‌ని హైప్ తో ఈ సినిమాలు రెండూ విడుదలయ్యాయి. రిలీజ్ త‌ర్వాత‌ ప్రేక్షకులు రెండు చిత్రాల గురించి చర్చించుకునే అవకాశం వచ్చింది. రెండిటిలో ఏది చూడాలో కొంద‌రు నిర్ణ‌యించుకున్నా.. రెండింటినీ చూస్తున్న వారు కూడా చాలా మంది ఉన్నారు. ఇక ఇండియాలో నోల‌న్ క్రేజ్ తో ఓపెన్ హైమ‌ర్ భారీ ఓపెనింగుల‌ను సాధించింది. అయితే రెండు చిత్రాల ను ఒకే థియేట‌ర్లో ఆస్వాధించ‌డం సాధ్య‌మ‌ని ప్రూవైతే..! నిజంగానే ఒక థియేట‌ర్ ప్రొజెక్ష‌న్ లో అలాంటి ఊహించ‌ని ట్విస్ట్ మ‌తి చెడ‌గొట్టింది.

ఓపెన్ హైమ‌ర్ థియేట‌ర్ లో బార్బీ సబ్ టైటిల్స్ క‌నిపించ‌డం బిగ్ ట్విస్ట్. బ‌యోపిక్ సినిమా ఆడుతున్న తెర‌పై బార్బీ స‌బ్ టైటిల్స్ ప‌డ‌గానే ఆడియెన్ ఒక్క‌సారిగా షాక్ కి గుర‌య్యారు. ఇంత‌లోనే తేరుకుని బార్బీహైమ‌ర్ ట్విస్ట్ అంటూ స‌ర‌దాగా మీమ్స్ ని వైర‌ల్ చేసారు. చాలా మంది ఈ త‌ప్పిదంపై జోకులు వేస్తూ ఫోటోలు చిన్న వీడియో క్లిప్ లను సోషల్ మీడియాల్లో షేర్ చేసారు. అంతేకాదు.. ఈ తప్పు చేసింది భారతీయ థియేటర్ అని కూడా వెల్ల‌డించారు.

అనుకోని ఈ పొరపాటు తో బార్బెన్‌హైమర్ నిజమేన‌ని ప్రజలు స‌ర‌దాగా వ్యాఖ్యానించ‌డం ప్రారంభించారు. ఇది సరికొత్త మీమ్ ఫెస్ట్ కి దారితీసింది. పూర్తిగా భిన్నమైన నేపథ్యాలతో తెర‌కెక్కిన సినిమాలు కావ‌డంతో చాలామంది ఖంగు తిన్నారు. ఓపెన్ హైమర్ అణు బాంబు పితామ‌హుడి కథను తెర‌ పై చూపించ‌గా.. బార్బీ పూర్తిగా ఊహాజ‌నిత‌మైన ఒక బొమ్మ‌కు ప్రాణం వ‌స్తే ఎలా ఉంటుంది? అనే క‌థ‌తో తెర‌కెక్కింది.

Tags:    

Similar News