నష్టాలను పూడ్చడం కోసం హీరో ఇలా బ్లాక్!
మోహన్ లాల్ స్వీయా దర్శకత్వంలో నటించిన 'బరోజ్' ఇటీవల రిలీజ్ అయి డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే.
మోహన్ లాల్ స్వీయా దర్శకత్వంలో నటించిన 'బరోజ్' ఇటీవల రిలీజ్ అయి డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. లాల్ ఈ చిత్రాన్ని ఓ డ్రీమ్ ప్రాజెక్ట్ గా భావించి పట్టాలెక్కించారు. మాలీవుడ్ లోనే తొలి భారీ బడ్జెట్ చిత్రంగా నిలి చింది. ఆశీర్వాద్ సినిమాస్ ఏకంగా 150 కోట్ల బడ్జెట్తో నిర్మించింది. నిర్మాణంలో ఎక్కడా రాజీ పడలేదు. ప్రతీ ప్రేమ్ ను ఎంతో అందంగా తీర్చారు. పెట్టిన ప్రతీ రూపాయి సినిమాలో కనిపించింది. కానీ ప్రేక్షకులకు మాత్రం రుచిం చలేదు. బాక్సాఫీస్ వద్ద కేవలం 20 కోట్ల వసూళ్లను మాత్రమే సాధించింది.
దీంతో నష్టాలు ఏ స్థాయిలో వచ్చాయి? అన్నది అంచనా వేయోచ్చు. పైగా మోహన్ లాల్ తొలిసారి కెప్టెన్ కుర్చి ఎక్కిన చిత్రమే ఇలా అవ్వడంతో? ఆయన తీవ్ర నిరుత్సాహనికి గురయ్యారు. అన్నింటిని మించి నిర్మాతకు భారీ నష్టం తెచ్చిన చిత్రంగా నిలిచింది. దీంతో ఇప్పుడా నష్టాలను పూడ్చాల్సిన బాధ్యత కూడా మోహన్ లాల్ పైనే ఉంది. ఈ నేపథ్యంలో ఆశీర్వాద్ సినిమాలో మోహన్ లాల్ హీరోగా వరుసగా 6 సినిమాలకు అగ్రిమెంట్ చేసుకున్నట్లు సమాచారం.
ఆ సినిమాల బడ్జెట్ మొత్తం కలిపి 150 కోట్లు అట. అంటే ఒక్కో సినిమా బడ్జెట్ 25 కోట్లు చొప్పున కేటాయించినట్లు తెలుస్తోంది. మాలీవుడ్ సినిమాలన్నీ పరిమిత బడ్జెట్ లో నిర్మాణం అవుతుంటాయి. ఇప్పుడా కోవలోనే ఆరు సినిమాలకు మోహన్ లాల్ అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. మోహన్ లాల్ లో బడ్జెట్ సినిమాలు గతంలో మంచి ఫలితాలు సాధించాయి. నటుడిగా 400 సినిమాలు చేసిన చరిత్ర ఆయన సొంతం.
అందులో ఎక్కువగా మాలీవుడ్ లో మంచి విజయవంతమైన చిత్రాలే. ఏడాది పది నుంచి ఆరు సినిమాలు రిలీజ్ చేయడం అన్నది ఆయనకు నల్లేరు మీద నడకలాంటింది. `బరోజ్` పరాజయం నేపథ్యంలో లాల్ సాబ్ మరోసారి విశ్వరూపం చూపించాల్సిన సమయం వచ్చింది. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తోన్న రెండు సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ లో ఉండగా మరో మూడు నాలుగు సినిమాలు ఆన్ సెట్స్ లో ఉన్నాయి.