నిర్మాత‌ల మోసం అంటూ కోర్టు కెళ్లిన వైజాగ్ డిస్ట్రిబ్యూట‌ర్!

'ఏజెంట్' సినిమా ద్వారా నేను మోస‌పోయాను. నాకు జ‌రిగిన అన్యాయం అంద‌రికీ తెలియాల‌నే ఇలా ఓపెన్ అవుతున్నాను.

Update: 2023-08-09 07:49 GMT

ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఏ.కె ఎంట‌ర్ టైన్ మెంట్స్ అధినేత‌లు అనీల్ సుంక‌రూ-గ‌రిక‌పాటి కృష్ణ కిషోర్ న‌మ్మించి మోసం చేసారంటూ విశాఖ‌ప‌ట్ట‌ణం డిస్ట్రిబ్యూట‌ర్ బత్తుల సత్యనారాయణ (సతీష్- వైజాగ్ ) ఆరోపించారు. దీనికి సంబంధించి స‌త్య‌నారాయ‌ణ ఓ లేఖ కూడా రిలీజ్ చాసారు.

'ఏజెంట్' సినిమా ద్వారా నేను మోస‌పోయాను. నాకు జ‌రిగిన అన్యాయం అంద‌రికీ తెలియాల‌నే ఇలా ఓపెన్ అవుతున్నాను. 'ఏజెంట్' సినిమా హ‌క్కులు తెలంగాణ- ఆంధ్ర ప్రదేశ్- కర్ణాటకలకు 5 యేళ్ల పాటు నా గాయత్రి దేవి ఫిలిమ్స్ కు అందజేస్తామని 30 కోట్ల‌కు అగ్రిమెంట్ చేసుకున్నాం. 30 కోట్లు తీసుకుని ప్లేట్ ఫిరాయించారు. బ్యాక్ అకౌంట్ రూపంలో నా స‌హ‌చ‌ర వ్యాపార మిత్రుల స‌హ‌కారంతో 30 కోట్ల వైట్ మనీని ఏజెంట్ కి మూడు రాష్ట్రాల‌కు గాను నేను చెల్లించిన‌ట్లుగా అన్ని ఆధారాలున్నాయి.

కానీ 'ఏజెంట్' సినిమా రిలీజ్ స‌మ‌యంలో విశాఖ జిల్లాకే ప‌రిమితం చేసి అగ్రిమెంట్ కు తూట్లు పొడిచారు. ఆ తర్వాత మేలో వారి ఆఫీస్ కు వెళ్లి గరికపాటి కృష్ణ కిషోర్ ని క‌లిసాను. ఆ త‌ర్వాత ఏజెంట్ సినిమా వైఫల్యాల గురించి చెప్పారు.

దీంతో అండర్ టేకింగ్ లెటర్ ఇస్తామని చెప్పారు. ఆ న‌మ్మ‌కంతో తిరిగి వైజాగ్ వెళ్లిపోయాను. ఆ త‌ర్వాత రిలీజ్ అయిన 'సామజవరగమన' డిస్ట్రిబ్యూషన్ హక్కులను విశాఖపట్నం వరకు ఇచ్చారు. దాని ద్వారా కొంత న‌ష్టం భ‌ర్తీ అయింది.

మ‌రో 45 రోజుల్లో మిగ‌తా డ‌బ్బు చెల్లిస్తామ‌న్నారు. అలా కానీ ప‌క్షంలో త‌దుప‌రి సినిమా రిలీజ్ లోపు చెల్లిస్తామ‌న్నారు. వారి నుంచి ఇప్పుడు 'భోళా శంక‌ర్' రిలీజ్ అవుతుంది. దీంతో కొన్ని రోజులుగా వాళ్లు నాకు స‌మాధానం చెప్ప‌డం లేదు. ఫిలిం ఛాంబ‌ర్ పెద్ద‌ల దృష్టికి ఈ విష‌యం తీసుకెళ్లాను. అయినా ఎలాంటి ఫ‌లితం లేదు. అందుకే త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో కోర్టు మెట్లు ఎక్కాల్సి వ‌చ్చింది. సినిమా రంగంతో నా బంధం విడ‌దీయ‌రానిది. ఎన్నో సినిమాలు పంపిణీ చేసాను.

ఏ.కె ఎంట‌ర టైన్ మెంట్స్ లోనే ఎన్నో సినిమాలు చేసాను. గ‌తంలో ఎప్పుడు ఇలాంటి అనుభ‌వం ఎదుర‌వ్వ‌లేదు. కానీ నాద‌గ్గర 30 కోట్లు తీసుకుని..స‌మాధానం చెప్ప‌కుండా... పైగా నాపై త‌ప్పుడు పోర్జ‌రీ చేసాన‌ని నింద కూడా వేసారు. ఏకె ఎంట‌ర్ టైన్ మెంట్స్ పై గ‌తంలో యూరో స్ ఇంటర్నేషనల్ కూడా కేసు పెట్టింది. చెక్కులు బౌన్స్ అవ్వ‌డంతోనే ఈ ప‌రిస్థితి వ‌చ్చింది. న్యాయం కోసం అడ్వొకేట్ కేశాపురం సుధాకర్ ద్వారా న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది. అలాగే క్రిమిన‌ల్ కేసు కూడా ఫైల్ చేసాను. అలాగే ఫైనాన్సియర్స్ అందరి పైన ఈడీకి ఫిర్యాదు చేయడం జరుగుతుంది. 'భోళా శంక‌ర్' లో చిరంజీవి గారు న‌టించారు కాబట్టి ఇంత‌కాలం సైలెంట్ గా ఉన్నాను. నిర్మాత‌లు నాపైనే నింద‌లు వేసే స‌రికి వాస్త‌వాలు చెప్పాల‌ని ఇలా చెప్పాల్సి వ‌చ్చింది' అని అన్నారు.

Tags:    

Similar News