బెదురులంక 2012.. మొత్తానికి టార్గెట్ ఫినిష్

దీంతో మొదటి నాలుగు రోజుల్లోనే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అందుకోవడం విశేషం. ఈ విషయాన్ని అఫీషియల్ పోస్టర్ తో కన్ఫర్మ్ చేశారు

Update: 2023-08-30 04:52 GMT

కార్తికేయ హీరోగా తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన మూవీ బెదురులంక 2012. డిఫరెంట్ కాన్సెప్ట్ తో కామెడీ ఎంటర్టైనర్ గా థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ మూవీ మొదటిరోజు పర్వాలేదని టాక్ సొంతం చేసుకుంది. తరువాత మెల్లగా పుంజుకొని ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. దీంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఈ చిత్రాన్ని చూడటానికి థియేటర్స్ కి వస్తున్నారు.


దీంతో మొదటి నాలుగు రోజుల్లోనే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అందుకోవడం విశేషం. ఈ విషయాన్ని అఫీషియల్ పోస్టర్ తో కన్ఫర్మ్ చేశారు. ఆర్ఎక్స్ 100 సినిమా తర్వాత కార్తికేయ కెరియర్ లో సాలిడ్ హిట్ ఇప్పటి వరకు పడలేదు. డిఫరెంట్ జోనర్ కథలు ట్రై చేసిన రాని సక్సెస్ బెదురులంక 2012 మూవీతో వచ్చింది. ఓ చిన్న విలేజ్ నేపథ్యంలో ఈ మూవీ కథ మొత్తం నడుస్తుంది.

నేహా శెట్టి ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించడం విశేషం. ఆమెకిది రెండో బ్లాక్ బస్టర్ క్లాక్స్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కాగా రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మించారు. సినిమాని ఆరంభం నుంచి డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీగా ప్రాజెక్ట్ చేస్తూ వస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ గా మణిశర్మకి కూడా ఈ చిత్రం చాలా రోజుల తర్వాత ఒక సాలిడ్ హిట్ ఇచ్చింది. అతను అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా బెదురులంక సక్సెస్ లో భాగం అయ్యిందని చెప్పాలి.

అలాగే అజయ్ ఘోష్, శ్రీకాంత్ అయ్యంగార్, ఆటో రామ్ ప్రసాద్, గోపిరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్ లాంటి నటుల పెర్ఫార్మెన్స్ కూడా మూవీకి అసెట్ అయ్యింది. ఓవరాల్ గా ఈ ఏడాది తెలుగులో 17వ హిట్ మూవీగా బెదురులంక నిలిచింది. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ సాధించడంతో లాంగ్ రన్ లో ఏ స్థాయిలో కలెక్షన్స్ ని రాబడుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

సెప్టెంబర్ 1న ఖుషి మూవీ రిలీజ్ ఉంది. అంటే మరోరెండు రోజుల పాటు ఈ చిత్రానికి స్కోప్ దొరికినట్లే తరువాత ఖుషి మూవీ ఫలితం బట్టి బెదురులంక కలెక్షన్స్ ఆధారపడి ఉంటాయని చెప్పొచ్చు.

Tags:    

Similar News