బెనిఫిట్ షోలు బంద్..హీరోలకిది పెద్ద షాక్!
కొత్త సినిమాలు లేకపోవడం..ఉన్న సినిమాలు వేసినా కనీసం థియేటర్ మెయింటనెన్స్ ఖర్చులు కూడా రాకపోవడంతో మూసేయాల్సినే పరిస్థితి నెలకొంది.
తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్ థియేటర్ల పరిస్థితి ఎలా ఉందో తెలిసిందే. హిట్ సినిమాలుంటే ఆడించడం లేదంటే మూత వేసుకోవడం అన్నట్లే సన్నివేశం కనిపిస్తుంది. ఇప్పటికే తెలంగాణలో రెండు వారాల పాటు థియేటర్ల బంద్ కొనసాగుతుంది. కొత్త సినిమాలు లేకపోవడం..ఉన్న సినిమాలు వేసినా కనీసం థియేటర్ మెయింటనెన్స్ ఖర్చులు కూడా రాకపోవడంతో మూసేయాల్సినే పరిస్థితి నెలకొంది.
ఈ నేపథ్యంలో ఇటీవలే థియేటర్స్, ఎగ్జిబిటర్స్ సమస్యలపై ఇటీవల తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, పలువురు డిస్ట్రిబ్యూటర్స్, నిర్మాతలు, ఎగ్జిబిటర్లు సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమావేశంలో కీలక అంశాలు చర్చకొచ్చినట్లు తెలుస్తోంది. అద్దె ప్రాతిపదికన కాకుండా సినిమాలకు పర్సంటేజ్ రూపంలో డబ్బులు చెల్లించాలని నిర్ణయించారు. ఒక్కోవారం ఒక్కోలా ఉండలే ఎగ్జిబిటర్లు..బయ్యర్ల మధ్య ఒప్పందం జరిగింది.
మునుపటిలా అద్దె ప్రతిపాదికన సినిమాలు ప్రదర్శించమని, మల్టీఫ్లెక్స్ తరహాలోనే పర్సంటెజీలు ఇస్తేనే ప్రదర్శిస్తామని తేల్చి చెప్పారు. దీనిపై నిర్మాతలు జులై 1 లోపు తమ అభిప్రాయం ఏంటి అన్నది చెప్పాల్సిందిగా గడువి విధించినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పర్సంటేజ్ ప్రాతిపదికన చెల్లించకపోతే థియేటర్లు మూసేస్తామని అల్టిమేటం ఇచ్చినట్లు తెలుస్తోంది.
గత పదేళ్లలో 2 వేల సింగిల్ స్క్రీన్ థియేటర్లు దేశవ్యాప్తంగా మూతపడ్డాయని, కొంత మంది డిస్టిబ్యూటర్లు సినిమా వ్యాపారాన్ని జూదంగా మార్చారని పాత సంగతులు గుర్తు చేసినట్లు తెలుస్తోంది. బెనిఫిట్ షోలు..ప్రీమియర్ షోల విషయంలోనూ పెద్ద ఎత్తున మోసం జరుగుతోందని..దానికి సంబంధించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా సమావేశంలో కోరినట్లు తెలుస్తోంది. ఇకపై అదనపు షోలు వేయమని నిర్ణయించినట్లు సమాచారం. బెనిపిట్ షోలు..అదనపు షోలు అనేవి హీరో-నిర్మాతలకు ఎంతో కీలకమైనవి. ఈ విషయంలో ఎగ్జిబిటర్లు కఠినంగా ఉంటే హీరోలు దెబ్బ అయినట్లే. నేరుగా హీరో, నిర్మాతలే ఎగ్జిబిటర్లను సముదాయించాల్సిన పరిస్థితులు రావొచ్చు.