భగవంత్ కేసరి సీక్వెల్.. అనిల్ రావిపూడి ఏం అన్నాడంటే?
భగవంత్ కేసరి సక్సెస్ సెలబ్రేషన్లలో ఆయనకు సీక్వెల్‌పై ఓ ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన బదులిస్తూ.. భగవంత్ కేసరికి సీక్వెల్ తీసేంత ధైర్యం నాకు లేదు.
ప్రస్తుతం చిత్ర సీమలో సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. హిట్ టాక్ అందుకున్న ప్రతి చిత్రానికి సీక్వెల్ లేదా ఫ్రాంచైజీ అంటూ సినిమాలు వస్తున్నాయి. అలానే మొదటి భాగం రిజల్ట్‌తో సంబంధం లేకుండానే.. మూవీ చివర్లో రెండో భాగానికి సంబంధించి హింట్ కూడా ఇస్తున్నారు దర్శకులు. అయితే ఇందులో చాలా వరకు సినిమాలు ప్రకటనల వరకే పరిమితం అవుతున్నాయి.
అయితే ప్రస్తుతం టాలీవుడ్లో భగవంత్ కేసరి దసరా కానుకగా రిలీజై బాక్సాఫీస్ ముందు మోత మోగిస్తోంది. మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది. ఫ్యామిలీ ఆడియెన్స్ మాస్ ఆడియెన్స్.. అందరూ థియేటర్లకు పోటెత్తుతున్నారు. దీంతో ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందా అనే ఓ చర్చ ప్రస్తుతం గట్టిగా నడుస్తోంది. తాజాగా దీనిపై ఈ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి స్పందించారు.
భగవంత్ కేసరి సక్సెస్ సెలబ్రేషన్లలో ఆయనకు సీక్వెల్‌పై ఓ ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన బదులిస్తూ.. భగవంత్ కేసరికి సీక్వెల్ తీసేంత ధైర్యం నాకు లేదు. ఇప్పటికే నేను ఈ భారంతో నలిగిపోయాను. ఒకవేళ సీక్వెల్ తీసేంత ధైర్యం, దమ్ము నాకు బాలకృష్ణ ఇస్తే.. అప్పుడు సీక్వెల్ గురించి ఆలోచిస్తాను అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట్లో ట్రెండ్ అవుతున్నాయి.
ఇక ఇదే వేడుకకు చీఫ్ గెస్ట్‌గా హాజరైన ప్రముఖ నిర్మాత దిల్ రాజు.. భగవంత్ కేసరి చిత్రం చాలా రోజుల పాటు ఆడే సినిమా అని అన్నారు. అనిల్ రావిపూడి తన బ్యానర్లో ఐదు చిత్రాలు చేసినట్లు గుర్తుచేసుకున్నారు. భగవంత్ కేసరి కథ నాకు ఎప్పుడో చెప్పాడు అనిల్.
తెలంగాణ మాండలికంలో బాలయ్య డైలాగ్స్ చెబితే కొత్తగా ఉంటుందని చెప్పాను. ముందు ఈ చిత్రానికి బ్రో.. ఐ డోంట్ కేర్ అనే టైటిలే అనుకున్నాడు. తర్వాత భగవంత్ కేసరిగా మార్చాడు. ఇది లాంగ్ రన్ ఫిల్మ్ అని దిల్ రాజు అన్నారు.
ఇకపోతే ఈ చిత్రంలో బాలయ్యతో పాటు శ్రీలీల, కాజల్ అగర్వాల్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ ఇద్దరి పాత్రలు కూడా సినీ ప్రియులను బాగా ఆకట్టుకున్నాయి.