భాగ్యశ్రీ.. సింపుల్ గా సెగలు రేపుతోందిగా!
తాజాగా కొత్త ఫొటోస్ ను షేర్ చేశారు. వైట్ టాప్, డెనిమ్ జీన్స్ లో దిగిన ట్రెండీ పిక్స్ ను పంచుకున్నారు.
మరాఠీ బ్యూటీ భాగ్యశ్రీ బొర్సే.. మాస్ మహారాజా రవితేజ మూవీతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి పరిచయమైన విషయం తెలిసిందే. ఫ్రెండ్స్ ఎంకరేజ్మెంట్ తో మోడలింగ్ లో అడుగుపెట్టి కెరీర్ స్టార్ట్ చేసిన అమ్మడు.. ఆ తర్వాత అనేక బ్రాండ్స్ ను ప్రమోట్ చేశారు. పలు బిజినెస్ యాడ్స్ లో కనిపించి స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు.
గత ఏడాది బాలీవుడ్ మూవీ యారియన్ -2తో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమాలో తన అందం, అభినయంతో మెప్పించారు. చందూ ఛాంపియన్ అనే మరో హిందీ సినిమాలో నటించిన భాగ్యశ్రీ.. మిస్టర్ బచ్చన్ తో తెలుగులోకి వచ్చారు. ఆ సినిమాలో జిక్కీ రోల్ పోషించి తన యాక్టింగ్ తో మంచి ప్రశంసలు అందుకున్నారు.
ఆమె హావభావాలతోపాటు డ్యాన్స్ కు టాలీవుడ్ మూవీ లవర్స్ ఫిదా అయ్యారు. మూవీ అనుకున్న స్థాయిలో ఆకట్టుకోకపోయినా.. భాగ్యశ్రీ మాత్రం స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఆ తర్వాత ఆమెకు ఆఫర్లు వచ్చినట్లు కనిపించకపోయినా.. రీసెంట్ గా రెండు క్రేజీ ఛాన్సులు అందుకున్నారు.
ప్రస్తుతం మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కాంత మూవీలో హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్నారు. పీరియాడికల్ థ్రిల్లర్ జోనర్ లో రూపొందుతున్న ఆ సినిమాలో రానా విలన్ గా నటిస్తున్నారు. అదే సమయంలో యంగ్ హీరో రామ్ పోతినేని సినిమాలో హీరోయిన్ గా కనిపించనున్నారు. రీసెంట్ గా ఆ మూవీ షూటింగ్ స్టార్ట్ అయింది.
అయితే సోషల్ మీడియాలో మిగతా హీరోయిన్లలాగా అంతలా యాక్టివ్ గా ఉండరు. అప్పుడప్పుడు మాత్రమే క్రేజీ పిక్స్ ను పోస్ట్ చేస్తుంటారు. కానీ ఓ రేంజ్ లో అలరిస్తుంటారు. తాజాగా కొత్త ఫొటోస్ ను షేర్ చేశారు. వైట్ టాప్, డెనిమ్ జీన్స్ లో దిగిన ట్రెండీ పిక్స్ ను పంచుకున్నారు. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
భాగ్యశ్రీ పిక్స్ అదిరిపోయాయని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. సో గ్లామరస్ మేడమ్ అని చెబుతున్నారు. అట్రాక్ట్ అవుతున్నామని అంటున్నారు. లైకులు కొడుతూ షేర్ చేస్తున్నారు. సింపుల్ గా ఉండే సెగలు రేపుతున్నారని రచ్చ రచ్చ చేస్తున్నారు. నెక్స్ట్ మూవీస్ తో మంచి హిట్స్ కొట్టాలని ఆకాంక్షిస్తున్నట్లు చెబుతున్నారు. మరి అమ్మడు తన చేతిలో ఉన్న కొత్త చిత్రాలతో సినీ ప్రియులను ఎలా ఆకట్టుకుంటారో వేచి చూడాలి.