పండులాంటి బచ్చన్ పాప.. అదిరిపోయే గ్లామర్ ట్రీట్

ఆ మూవీ సక్సెస్ కాకపోయినా కూడా ఆమెకు తెలుగులో మంచి గుర్తింపు వచ్చింది.;

Update: 2025-03-30 03:30 GMT
పండులాంటి బచ్చన్ పాప.. అదిరిపోయే గ్లామర్ ట్రీట్

సౌందర్యంతో పాటు అద్భుతమైన ఎక్స్‌ప్రెషన్లతో టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న భగ్యశ్రీ బోర్స్ సౌత్ ఇండస్ట్రీలో వేగంగా తన మార్క్ ఏర్పరుచుకుంటోంది. టీవీ కమర్షియల్స్‌తో మొదలై, వెబ్‌ సిరీస్‌ల్లో నటించిన ఈ అందాల భామకు, మొదట టాలీవుడ్‌ సినిమా ‘మిస్టర్ బచ్చన్’లో రవితేజ సరసన అవకాశం వచ్చింది. ఆ మూవీ సక్సెస్ కాకపోయినా కూడా ఆమెకు తెలుగులో మంచి గుర్తింపు వచ్చింది.


ప్రస్తుతం ఆమె మూడు సినిమాల్లో నటిస్తోంది. అందులో బెల్లంకొండ గణేష్ తో ఒక సినిమా చేస్తుండగా, పలు వెబ్ ప్రాజెక్ట్స్ కోసం కూడా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇటీవల భగ్యశ్రీ తన సోషల్ మీడియాలో పంచుకున్న తాజా ఫోటోషూట్ తో ఫ్యాన్స్ ముంచెత్తుతున్నారు. శ్రీలంకలో తీసుకున్న ఈ పిక్స్ వెకేషన్ వైబ్ తో స్టైలిష్ లుక్ హైలెట్ అవుతోంది. తెల్లటి బెడ్ పై కూర్చుని, చేతిలో మామిడిపండు ముక్కతో క్యూట్‌ స్మైల్ ఇస్తూ ఆమె ఇచ్చిన పౌజ్ నిజంగా మ్యాజికల్‌గా కనిపిస్తోంది.


ఆమె చిరునవ్వు, బ్లాక్ షేడ్స్‌తో కలిసిపోయి ఒక విన్నూత్నమైన క్లాసీ లుక్‌ను అందించింది. వైట్ స్లీవ్‌లెస్ టాప్, బ్లాక్ మినీ స్కర్ట్‌లో భగ్యశ్రీ గ్లామర్ డోస్ పెంచింది. అయితే అది అసహజంగా కాకుండా పాజిటివ్ వైబ్స్‌తో ఫ్రెష్‌నెస్‌ను తెచ్చేలా ఉంది. టెర్రిఫిక్ కర్లీ హెయిర్ స్టైల్, స్మార్ట్ సన్‌గ్లాసెస్, రూమ్ డెకరేషన్ – అన్నీ కలిపి ఒక హాలిడే గ్లోను ఇచ్చాయి. పక్కనే ఉన్న మామిడిపండు బౌల్‌ కూడా ఆమె క్యాప్షన్‌ను బాగా కంప్లీట్ చేసింది "శ్రీలంక వాతావరణానికి సరిపోయే కొంచెం తీపి" అనే మాటలే ఫాలోవర్స్‌ను ఫిదా చేశాయి.


ఈ ఫోటోల ద్వారా తన హాలీడే మూడ్‌ను మధురంగా చూపించిన భగ్యశ్రీ, ట్రెండింగ్‌లో నిలుస్తోంది. స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎంట్రీ ఇచ్చే ఈ గ్లామర్ ఫోటోస్ ఇప్పుడు నెట్‌లో వైరల్ అవుతున్నాయి. సాధారణంగా అందమైన లొకేషన్లు, స్టైలిష్ డ్రెస్సింగ్‌తో పాటు నేచురల్ స్మైల్‌తో అట్రాక్షన్ క్రియేట్ చేయడంలో భగ్యశ్రీ దిట్ట అని చెప్పొచ్చు. అలా చూస్తుంటే త్వరలోనే ఆమె తెలుగు ఇండస్ట్రీలో టాప్ రేంజ్‌లోకి వెళ్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Tags:    

Similar News