గణపతి శ్లోకం తర్వాతే వీధిలోకి వచ్చే హీరోయిన్!
పుస్తక పఠనం అన్నది అందరికీ ఉండే అలవాటు కాదు. చాలా కొద్ది మందే బుక్ రీడింగ్ పై ఆసక్తి చూపిస్తుంటారు. అందులోనూ హీరోయిన్లు చదువంటే? ఆమడ దూరంలోనే కనిపిస్తున్నారు.
పుస్తక పఠనం అన్నది అందరికీ ఉండే అలవాటు కాదు. చాలా కొద్ది మందే బుక్ రీడింగ్ పై ఆసక్తి చూపిస్తుంటారు. అందులోనూ హీరోయిన్లు చదువంటే? ఆమడ దూరంలోనే కనిపిస్తున్నారు. అకాడమిక్ స్టడీస్ వరకూ బాగానే ఉంటుంది. కానీ ఆ తర్వాత చదువు అంటే పెద్దగా ఆసక్తి చూపనట్లు చాలా మంది భామల మాటల్లో బయట పడుతుంది. గ్లామర్ ఫీల్డ్ పై ఆసక్తితో మోడలింగ్ నుంచి సినిమా రంగంలోకి వస్తుంటారు.
ఈ క్రమంలో చదువును కూడా గాలికి వదిలేస్తుంటారు. అయితే భాగ్య శ్రీ బోర్సే మాత్రం వాళ్లకు భిన్నం. అమ్మడికి పుస్తకాలంటే పిచ్చి అట. ఖాళీ సమయం దొరికితే పుస్తక పఠనానికి ప్రాధాన్యత ఇస్తుందట. అందులోనూ మిషెల్ ఒబామా రచనలకు వీరాభిమాని అట. మిషెల్ పుస్తకాలు తనలో స్పూర్తిని నింపాయంటోంది. ఆమె ని శక్తివంతమైన మహిళగా పేర్కొంది. ఆమె రచనలు మహిళల్లో ఆత్మస్తైర్యాన్నిపెంపొందించేలా ఉంటాయంది.
స్నేహితులకు ఎవరికైనా బహుమతులు ఇవ్వాలంటే? మిషెల్ పుస్తకాలే ఇస్తుందట. అవి కొన్ని షాపుల్లో దొరకకపోయినా వెతికి వెతికి మరీ కొనుగోలు చేస్తుందట. అలాగే దైవ భక్తి కూడా ఎక్కువేనట. భగవన్నామస్మరణ పాజిటివ్ ఎనర్జీ ఇస్తుందంది. గణపతి శ్లోకం చదివిన తర్వాతే ఇంట్లో నుంచి బయటకువస్తుందట. షూటింగ్ జరిగే ప్రాంతాల్లో ఆలయాలు ఉంటే వాటిని తప్పక దర్శించుకుంటిదట.
రాముడ్ని ఎక్కువగా ఆరాదిస్తుందట. మరి రామాయణం ఎన్నిసార్లు చదవిందో? ఇలాంటి భామకు రామయణంలో సీత పాత్ర ను అప్పగిస్తే అద్భుతంగా పండిస్తుంది. అలాగే బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ కి వీరాభిమాని అట. తొలి క్రష్ షారుక్ ఖాన్ గా పేర్కోంది. ఎప్పటికైనా షారుక్ ఖాన్ తొ ఒక్క సినిమాలో నైనా నటించాలని ఉందని తెలిపింది.