భాగ్య శ్రీ సుడి తిరిగితే మాత్రం..!

ముఖ్యంగా మిస్టర్ బచ్చన్ లో అమ్మడి గ్లామర్ షోకి కుర్రాళ్లు ఫిదా అయ్యారు. అందుకే ఆడియన్స్ లో ఆమెకున్న ఐడెంటిటీ చూసి వరుస ఆఫర్లు ఇస్తున్నారు.

Update: 2024-12-28 01:30 GMT

సరిగ్గా ఇండస్ట్రీలో హీరోయిన్స్ కొరత ఉన్నప్పుడే ఎంట్రీ ఇచ్చిన భామ భాగ్య శ్రీ బోర్స్. బాలీవుడ్ లో యారియాన్ 2 తో ఎంట్రీ ఇచ్చిన అమ్మడు హరీష్ శంకర్ దృష్టి పడింది. దాంతో మాస్ మహారాజ్ రవితేజతో చేసిన మిస్టర్ బచ్చన్ కోసం ఎంపిక చేశారు. ఆ సినిమా కమర్షియల్ గా వర్క్ అవుట్ కాకపోయినా సరే భాగ్య శ్రీకి మాత్రం మంచి పాపులారిటీనే తెచ్చింది. ముఖ్యంగా మిస్టర్ బచ్చన్ లో అమ్మడి గ్లామర్ షోకి కుర్రాళ్లు ఫిదా అయ్యారు. అందుకే ఆడియన్స్ లో ఆమెకున్న ఐడెంటిటీ చూసి వరుస ఆఫర్లు ఇస్తున్నారు.

ఇప్పటికే విజయ్ దేవరకొండ తో ఒక సినిమా చేస్తున్న భాగ్య శ్రీ ఆ సినిమాతో కచ్చితంగా హిట్ కొట్టేలా ఉంది. విజయ్ సినిమాలో హీరోయిన్స్ కి మంచి ప్రాధాన్యత ఉంటుంది. గౌతం తిన్ననూరి డైరెక్షన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈ మూవీపై భారీ హైప్ ఉంది. ఇక మరోపక్క దుల్కర్ సల్మాన్ తో కాంతా సినిమా కూడా చేస్తుంది భాగ్య శ్రీ. తెలుగు, తమిళ్ భాషల్లో తెరకెక్కే ఈ సినిమాతో భాగ్య శ్రీ మళ్లీ చర్చల్లో నిలుస్తుంది.

అటు విజయ్, ఇటు దుల్కర్ ఇద్దరితో అమ్మడు స్క్రీన్ షేర్ చేసుకుంటుంది. ఈ రెండిటిలో ఏ ఒక్క సినిమా హిట్ అయినా కచ్చితంగా భాగ్య శ్రీకి మంచి క్రేజ్ వస్తుందని చెప్పొచ్చు. ఇప్పటికే భాగ్య శ్రీ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో వేడి పెంచేస్తుంది. అటు సినిమాలు ఇటు ఫోటో షూట్స్ రెండిటిలో భాగ్యాన్ని చూసి ఆడియన్స్ వారెవా అనేస్తున్నారు. ఒక సినిమా హిట్ పడితే మాత్రం అమ్మడు టాలీవుడ్ లో టాప్ ప్లేస్ కి వెళ్లినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని చెప్పొచ్చు.

ప్రస్తుతం సీనియర్ హీరోయిన్స్ అంతా సైడ్ అయిన ఈ టైం లో వచ్చిన ప్రతి ఛాన్స్ ని పర్ఫెక్ట్ గా వాడుకుంటే మాత్రం భాగ్య శ్రీ బోర్స్ కి తిరుగు ఉండదని చెప్పొచ్చు. ముఖ్యంగా అమ్మడి గ్లామర్ షోకి సెపరేట్ క్రేజ్ ఏర్పడుతుంది కాబట్టి అమ్మడు అదే రేంజ్ లో రెచ్చిపోతే ఆమె కెరీర్ కు ప్లస్ అవుతుందని చెప్పొచ్చు. ఒక్క హిట్ పడి భాగ్య శ్రీ సుడి తిరిగితే మాత్రం కచ్చితంగా మిగతా హీరోయిన్స్ కి టఫ్ కాంపిటీషన్ అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Tags:    

Similar News