మేకప్ రూమ్ లో భాగ్యం మెరుపులు అదుర్స్..!

ఏ ముహూర్తాన భాగ్య శ్రీ బోర్స్ తెలుగు ఎంట్రీ ఇచ్చిందో కానీ ఆమె వెంట దర్శక నిర్మాతలు క్యూలు కట్టేస్తున్నారు.;

Update: 2025-04-09 00:30 GMT
మేకప్ రూమ్ లో భాగ్యం మెరుపులు అదుర్స్..!

ఏ ముహూర్తాన భాగ్య శ్రీ బోర్స్ తెలుగు ఎంట్రీ ఇచ్చిందో కానీ ఆమె వెంట దర్శక నిర్మాతలు క్యూలు కట్టేస్తున్నారు. హరీష్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన మిస్టర్ బచ్చన్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది భాగ్య శ్రీ. ఆ సినిమా ఆడకపోయినా అమ్మడి గ్లామర్ షో వల్ల సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. మిస్టర్ బచ్చన్ రిలీజ్ కాకుండానే అప్పటికే సెట్స్ మీదకు వెళ్లిన రెండు సినిమాల్లో ఓకే అయ్యింది అమ్మడు.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ కింగ్ డమ్, రామ్ సినిమాలో నటిస్తున్న భాగ్య శ్రీ మరోపక్క తెలుగు, తమిళ్ లో బైలింగ్వల్ గా వస్తున్న కాంతా సినిమాలో కూడా ఛాన్స్ పట్టేసింది. ఈ మూడు సినిమాలతో ప్రస్తుతం బిజీ బిజీగా ఉంటుంది భాగ్య శ్రీ బోర్స్. ఈ 3 సినిమాలు ఈ ఇయర్ లోనే వచ్చేలా ఉండగా 2025 కచ్చితంగా అమ్మడికి స్టార్ డం వచ్చేలా ఉంది. ఐతే సినిమాలు చేస్తున్నా కూడా భాగ్య శ్రీ తన సోషల్ మీడియా అప్డేట్స్ తో ఫ్యాన్స్ ని అలరిస్తుంది.

అమ్మడు తన ప్రతి అప్డేట్ ని సోషల్ మీడియా లో పెడుతుంది. మిస్టర్ బచ్చన్ టైంలోనే తెలుగు ఆడియన్స్ కు కనెక్ట్ అయిన భాగ్యానికి ఫాలోవర్స్ కూడా భారీగా పెరిగారు. ఈ క్రమంలో అమ్మడు తన ప్రతి అప్డేట్ తో ఫ్యాన్స్ ని అలరిస్తుంది. లేటెస్ట్ గా భాగ్య శ్రీ మేకప్ రూమ్ లో తన అందాలతో అదరగొట్టేస్తుంది. బ్లాక్ డ్రెస్ లో మేకప్ రూమ్ లో మిర్రర్ ముందు లైటింగ్ లో మెరుపులా మెరిసిపోతుంది భాగ్య శ్రీ.

ఫాలోవర్స్ ని ఎలా బుట్టలో వేయాలో బాగా తెలిసినట్టు ఉన్న ఈ అమ్మడు ఫోటో షూట్స్ తో రోజు రోజుకి తన ఫాలోయింగ్ పెంచుకుంటుంది. అంతేకాదు తన క్రేజీ ఫోటో షూట్స్ వల్ల అమ్మడి ఇమేజ్ కూడా డబుల్ అవుతుంది. కరెక్ట్ టైం కు టాలీవుడ్ వచ్చిన భాగ్య శ్రీకి ఇప్పటికే వరుస ఆఫర్లు వస్తుండగా ఈ ఫోటో షూట్స్ చూస్తే దర్శక నిర్మాతలు ఆమె వెంట పడక తప్పదు.

మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ అయితేనే అమ్మడికి ఇలాంటి ఆఫర్లు అంటే.. ఇక కింగ్ డం, రామ్ సినిమాలు హిట్టైతే ఇక టాలీవుడ్ లో అమ్మడిని ఆపడం కష్టమని చెప్పొచ్చు. మరి ఆ సినిమాల వల్ల భాగ్య శ్రీకి ఎంత క్రేజ్ వస్తుందన్నది చూడాలి.

Tags:    

Similar News