బ్లాస్ట్ కి సిద్ధమైన భైరవం.. పోస్టర్ తోనే కిక్కిచ్చారుగా..

నిర్మాణంలో ఉన్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ భైరవం సినిమాకు సంబంధించిన ప్రతీ చిన్న అప్డేట్ కూడా పాజిటివ్ వైబ్ ను క్రియేట్ చేస్తోంది.

Update: 2025-01-18 16:34 GMT

నిర్మాణంలో ఉన్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ భైరవం సినిమాకు సంబంధించిన ప్రతీ చిన్న అప్డేట్ కూడా పాజిటివ్ వైబ్ ను క్రియేట్ చేస్తోంది. సినిమాను ఎనౌన్స్ చేసినప్పుడే ఆసక్తిని పెంచింది. ఇక ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, మొదటి పాటతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు తాజాగా విడుదల చేసిన కొత్త పోస్టర్ ద్వారా జనవరి 20న టీజర్ విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.


ఈ పోస్టర్‌లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ముగ్గురూ రెడ్ కలర్ హై వోల్టేజ్ థీమ్ లో యుద్ధానికి సిద్దంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఇక కళ్లలో ఆగ్రహంతో ఉన్న ముగ్గురు ఏదో పెద్ద పోరాటానికి రెడీ అవుతున్నారని అనిపిస్తోంది. ఇక వారి హావభావాలు అభిమానులను, ప్రేక్షకులను మరింతగా ఆకర్షిస్తున్నాయి. ఈ ముగ్గురు నటులు ఒకే వేదికపై కనిపించడం యాక్షన్ సన్నివేశాలకు మరింత ఉత్కంఠను తీసుకువస్తోంది.

దర్శకుడు విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పల్లెటూరు నేపథ్యంలో సాగే కథతో, భారీ యాక్షన్ ఎపిసోడ్స్‌తో రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన పాటతో పాటుగా ఈ టీజర్ కూడా సినిమా మీద అంచనాలను పెంచుతుందని చిత్రబృందం నమ్మకంగా చెబుతోంది. ఈ సినిమా నిర్మాణం భారీ బడ్జెట్‌తో సాగుతుండగా, నిర్మాత కేకే రాధామోహన్ అన్ని అంశాల్లో కూడా ఎక్కడా రాజీ పడకుండా సినిమా అత్యున్నత ప్రమాణాలతో తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమాలో పవర్ఫుల్ కథతో పాటు సరికొత్త యాక్షన్ ఎలిమెంట్స్ ఉంటాయని అంటున్నారు. ఇక ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న శ్రీచరణ్ పాకాల ఇప్పటికే సాంగ్‌లతో ఓ వర్గం వారిని మాయచేశాడు. త్వరలో విడుదల కానున్న టీజర్ మరింతగా అందరి ఆసక్తిని పెంచే అవకాశం ఉంది. జనవరి 20న విడుదల కానున్న ఈ టీజర్ సినిమా పట్ల ఉన్న అంచనాలను మరింత పెంచుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

భైరవం చిత్రం పోస్టర్ మాత్రమే కాకుండా అందులోని ప్రతీ ఫ్రేమ్ ఆకర్షణీయంగా ఉండటం, కథలో కొత్తదనాన్ని ఇస్తుందనే అభిప్రాయాన్ని ప్రేక్షకులకు ఇస్తోంది. ఈ సినిమాపై ఉన్న ఆసక్తి, టీజర్ విడుదలకు ముందే తారా స్థాయికి చేరుకోవడం విశేషం. మరి సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News