భానుప్రియ గెట్ టూ గేద‌ర్ల‌కి అందుకే హాజ‌రు కారా?

అప్ప‌టి త‌రం న‌టీమ‌ణులంతా హాజ‌రవుతున్నారు కానీ రాజ‌మండ్రికి చెందిన తెలుగు న‌టి భాను ప్రియ మాత్రం ఆ గ్యాంగ్ ల ఎప్పుడూ క‌నిపించింది.

Update: 2024-08-02 00:30 GMT

1980-90 మ‌ధ్య కాలంలో ప‌నిచేసిన హీరో-హీరోయిన్లు ఏడాదికోసారి రీ-యూనియ‌న్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. హైద‌రాబాద్ లోనో...చెన్నైలోనో..బెంగుళూరులోనూ అంతా గెట్ టూ గేద‌ర్ ఏర్పాటు చేసుకుని నాటి రోజుల్ని గుర్తు చేసుకోవ‌డం జ‌రుగుతుంది. వీళ్లంద‌రికి ప్ర‌త్యేకంగా ఓ గ్రూప్ కూడా ఉంది. సుహాసిని, రాధ‌, రాధిక‌, మీనా ఇలా సౌత్ నుంచి ఉన్న నాటి హీరోయిన్లు అంతా దాదాపు త‌ప్ప‌క హాజ‌ర‌వుతుంటారు.

చిరంజీవి, నాగార్జున‌, బాల‌కృష్ణ‌, వెంక‌టేష్, భాను చంద‌ర్ స‌హా ఆ జ‌న‌రేష‌న్ హీరోలంతా ... హీరోయ‌న్ల‌తో క‌లిసి పాత మ‌ధుర జ్ఞాప‌కాల్లోకి వెళ్లిపోతుంటారు. ఆ ఈవెంట్కి సంబంధించిన ఫోటోల్ని నెట్టింట వేదిక‌గా అభిమానుల‌తో పంచుకుని వాళ్ల‌తో పాటు అభిమానుల్ని ఆనాటి రోజుల్లోకి తీసుకెళ్తుంటారు. అప్ప‌టి త‌రం న‌టీమ‌ణులంతా హాజ‌రవుతున్నారు కానీ రాజ‌మండ్రికి చెందిన తెలుగు న‌టి భాను ప్రియ మాత్రం ఆ గ్యాంగ్ ల ఎప్పుడూ క‌నిపించింది.

దీంతో ఆమె ఎందుకు రావ‌డం లేద‌ని ప‌లుమార్లు చ‌ర్చ‌కొచ్చినా స‌రైన స‌మాధానం దొర‌క‌లేదు. ఈనేప‌థ్యంలో తాజాగా భానుచంద‌ర్ కొన్నిఆస‌క్తిక‌ర విషయాలు పంచుకోవ‌డంతో విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. 'ఇలా అందరం కలుసుకోవాలనే ఒక ఆలోచన పూర్తిగా సుహాసిని ,లిజీకి వచ్చింది. వాళ్లకి ఆ ఆలోచన రాగానే మొదట నాకు కాల్ చేశారు. అప్పటి నుంచి అది ఆచరణలోకి వచ్చేసింది. అలా కలుసుకున్నప్పుడు పాత విషయాలన్నీ సరదాగా మాట్లాడుకుంటాము.

అప్పట్లో లవ్ గురించి ఆలోచనే మా మధ్య వచ్చేది కాదు . మంచి స్నేహితులుగానే ఉండేవాళ్లం. అందువలనే ఇప్పటికీ కలుసుకోగలుగుతున్నాము. అయితే భాను ప్రియ మాత్రం రావ‌డం లేదు. కుటుంబ సంబంధమైన సమస్యల కారణంగా భానుప్రియ రావడం మానేసింది. అలాగే సరితగారు ఇప్పటికీ టచ్ లోనే ఉన్నారు. రీ యూనియన్ పార్టీ సమయంలో రాకపోయినప్పటికీ, అందరికీ వాట్సాప్ గ్రూప్ ఉంది. అందులో ప్రతి రోజు చాట్ చేసుకుంటూనే ఉంటాము. అర్చన అందుబాటులో లేదు' అని అన్నారు.

Full View
Tags:    

Similar News