గోపీచంద్ భీమా.. బాక్సాఫీస్ టార్గెట్ ఎంతంటే?

డిస్టిబ్యూటర్స్ కూడా భీమా హక్కులు కొనడానికి ముందుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో ఈ సినిమా బిజినెస్ 6 కోట్ల వరకు వరకు జరిగిందంట.

Update: 2024-02-27 03:37 GMT

మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా ఏ హర్ష దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి రాబోతున్న చిత్రం భీమా. హై బడ్జెట్ తో యాక్షన్, థ్రిల్లర్ జోనర్ లో ఈ చిత్రాన్ని దర్శకుడు సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకి వచ్చిన ట్రైలర్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ చూసిన వారు ఈ సారి గోపీచంద్ కి మాస్ హిట్ పక్కా అని భావిస్తున్నారు.

మార్చి 8న శివరాత్రి కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. భీమా కంటే ముందు గోపిచంద్ ఖాతాలో వరుస ఫ్లాప్ లు ఉన్నాయి. కమర్షియల్ డైరెక్టర్స్ తో సినిమాలు చేస్తోన్న సక్సెస్ మాత్రం రావడం లేదు. అలాగే డిఫరెంట్ కథలు ప్రయత్నం చేస్తున్నారు.. భీమా ట్రైలర్ కి మంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో సినిమాపైన హైప్ క్రియేట్ అయ్యింది.

డిస్టిబ్యూటర్స్ కూడా భీమా హక్కులు కొనడానికి ముందుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో ఈ సినిమా బిజినెస్ 6 కోట్ల వరకు వరకు జరిగిందంట. అలాగే తెలంగాణాలో కూడా అంతే స్థాయిలో జరిగినట్లు తెలుస్తోంది. మొత్తం తెలుగు రాష్ట్రాలలో 12 కోట్ల బిజినెస్ అయ్యిందంట. వరల్డ్ వైడ్ గా 14 కోట్ల మేరకు సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ చేసినట్లు టాక్.

ఇక ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకుంది. శాటిలైట్ రైట్స్ స్టార్ మా డీసెంట్ రేటుకి దక్కించుకుందని తెలుస్తోంది. ఈ మూవీ 15 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో థియేటర్స్ లోకి వస్తోంది. మూవీకి పాజిటివ్ టాక్ ఉంది కాబట్టి కచ్చితంగా భారీ ఓపెనింగ్స్ రావొచ్చని భావిస్తున్నారు.

సినిమాకి ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చిన కూడా రెండు, మూడు రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ ని అందుకునే ఛాన్స్ ఉంది. మాళవిక శర్మ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. కేజీఎఫ్ స్టార్ రవి భీమా సినిమాకి సంగీతం అందిస్తూ ఉండటం విశేషం. ట్రైలర్ లో కూడా బ్యాగ్రౌండ్ స్కోర్ ఇప్పటికే హైలైట్ అయ్యింది. బిగ్ స్క్రీన్ పై నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని భావిస్తున్నారు.

Tags:    

Similar News