'భోళా శంక‌ర్'ని 'బ్రో' లా వ‌దిలేస్తారా? పెంచుతామంటారా?

బోళా శంక‌ర్ టిక్కెట్ ధ‌ర‌లు పెంచుతున్నారా? లే క 'బ్రో' త‌ర‌హాలోనే రిలీజ్ చేస్తున్నారా?

Update: 2023-08-09 11:18 GMT

మెగాస్టార్ చిరంజీవి న‌టించిన 'భోళా శంక‌ర్' భారీ అంచ‌నాల మ‌ధ్య మ‌రో రెండు రోజుల్లో ప్రేక్ష‌కుల ముందు కొస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇంతలొనే మెగాస్టార్ రాజ‌కీయాల్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్య‌లు ఏపీలో ఎంత‌టి దుమారం రేపిందో విధిత‌మే. ఇంత‌కాల మౌనంగా ఉన్న మెగాస్టార్ నోట తొలిసారి అభివృద్ది-పేద‌రిక నిర్మూల‌న‌-రోడ్లు వంటి అంశాలు రావ‌డంతో అధికార ప‌క్షం ఒక్క‌సారిగా భ‌గ్గుమంది.

మెగాస్టార్ పై ఏపీ మంత్రులు కొంత మంది ఆగ్ర‌హ జ్వాల‌లో ఊగిపోయారు. దీంతో సోష‌ల్ మీడియాలో వార్ ష‌రా మాములే అయింది. మంత్రులు వ‌ర్సెస్ మెగా ఫ్యాన్స్ అంటూ నెట్టింట పెద్ద ర‌చ్చే జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో 'భోళా శంక‌ర్' టిక్కెట్ ధ‌ర‌లు పెంచుతున్నారా? లేదా? అన్న అంశం తెర‌మీద‌కు వ‌స్తుంది. చిరంజీవి ఇమేజ్ నేప‌థ్యంలో టికెట్ ధ‌ర పెంచుకునే వెసులు బాటు ఉంది.

ప్ర‌భుత్వం ఆ ర‌కంగా ఇప్ప‌టికే జీవో కూడా ఇచ్చింది. అగ్ర హీరోల సినిమాల‌కు వారం రోజుల పాటు ఈ వెసులు బాటు క‌ల్పించింది. ఈ నేప‌థ్యంలో తాజాగా ఏపీలో మొద‌లైన కాక నేప‌థ్యంలో బోళా శంక‌ర్ టిక్కెట్ ధ‌ర‌లు పెంచుతున్నారా? లే క 'బ్రో' త‌ర‌హాలోనే రిలీజ్ చేస్తున్నారా? అన్న‌ది సందేహంగా మారింది. బ్రో సినిమా ని పాత ధ‌ర‌ల‌తోనే రిలీజ్ చేసారు. రేట్లు పెంచుకుంటామ‌ని బ్రో నిర్మాత‌లు ప్ర‌భుత్వాని అర్జీ పెట్టుకుంది లేదు. దీంతో ఎలాంటి ధ‌ర పెంచ‌కుండానే రిలీజ్ చేసారు.

ఈ నేప‌థ్యంలో 'భోళా శంక‌ర్' కూడా అలాగే రిలీజ్ అవుతుందా? లేక పెంచుతారా? అన్నం అంశం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అలాగే ఇప్ప‌టికే ఏపీ ప్ర‌భుత్వానికి చిత్ర నిర్మాతలు పెంపుకు సంబంధించి డాక్యుమెంట్లు అందించిన‌ట్లు..అయితే అవి అసంపూర్ణంగా ఉండ‌టంతో రిజెక్ట్ అయిన‌ట్లు నెట్టింట ప్ర‌చారం సాగుతోంది. మ‌రి ఇదే నిజ‌మైతే మ‌ళ్లీ స‌మ‌గ్ర‌మైన డాక్యుమెంట్ల‌తో వెళ్తే ప్ర‌భుత్వం ఎలాంటి అడ్డంకి ఏర్ప‌ర‌చుకుండా పెంచుకునే వెసులు బాటు క‌ల్పిస్తుందా అన్న‌ది చూడాలి.

అలాకాక 'బ్రో' త‌ర‌హాలోనే 'భోళా శంక‌ర్' కూడా రిలీజ్ వెళ్తే ప్ర‌భుత్వం ప‌నేలేదు. గ‌తంలో టిక్కెట్ ధ‌ర‌ల విష‌యంలో త‌లెత్తిన స‌మ‌స్య‌ని ప్ర‌భుత్వ పెద్ద‌ల‌తో...ముఖ్య‌మంత్రి తో నేరుగా చిరంజీవి మాట్లాడి ప‌రిష్క‌రించిన సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News