భూల్ భులయ్యా 3.. సీక్రెట్ ఏమిటంటే..

ఈ మూవీకి రెండు క్లైమాక్స్ ని డిజైన్ చేసినట్లు తెలిపారు. అయితే అవేంటి అనేది మూవీకి వర్క్ చేసినవారికి కూడా తెలియదని చెప్పారు.

Update: 2024-10-12 10:30 GMT

హిందీలో ఈ ఏడాది పెద్ద సినిమాలలో ఒక్కటి కూడా భారీ సక్సెస్ అందుకోలేదు. చిన్న, మీడియం రేంజ్ మూవీస్ మాత్రమే ఎక్కువ ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్నాయి. ఈ దీపావళి కనుకగా రెండు పెద్ద సినిమాలు ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. ఆ రెండు కూడా ఫ్రాంచైజ్ మూవీస్ కావడం విశేషం. రోహిత్ శెట్టి దర్శకత్వంలో ‘సింగం’ సిరీస్ లో భాగంగా తెరకెక్కిన ‘సింగం ఎగైన్’ మూవీ దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది.

ఈ సినిమాలో అజయ్ దేవగన్, రణవీర్ సింగ్, అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, దీపికా పదుకునే, అర్జున్ కపూర్ లాంటి స్టార్ యాక్టర్స్ అందరూ నటిస్తున్నారు. మరో వైపు హర్రర్ కామెడీ సిరీస్ ‘భూల్ భులయ్యా’ ఫ్రాంచైజ్ నుంచి పార్ట్ 3 మూవీ దీపావళికి రిలీజ్ కాబోతోంది. ఈ రెండు కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలు కావడంతో రెండింటిపైన హైఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ రెండు సక్సెస్ ఫుల్ ఫ్రాంచైజ్ లు కావడం విశేషం.

‘భూల్ భులయ్యా 3’ మూవీలో కార్తీక్ ఆర్యన్ , విద్యా బాలన్, మాధురీ దీక్షిత్, త్రిప్తి డిమ్రి మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ చేశారు. అనీష్ బజ్మీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై ప్రేక్షకుల అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. ‘స్త్రీ 2’ మూవీ సూపర్ హిట్ కావడంతో ‘భూల్ భులయ్యా 3’ కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి దర్శకుడు అనీష్ బజ్మీ ఆసక్తికర విషయాన్ని రివీల్ చేశాడు.

ఈ మూవీకి రెండు క్లైమాక్స్ ని డిజైన్ చేసినట్లు తెలిపారు. అయితే అవేంటి అనేది మూవీకి వర్క్ చేసినవారికి కూడా తెలియదని చెప్పారు. ముందుగా అనుకున్న క్లైమాక్స్ విషయంలో అంత సంతృప్తికరంగా లేకపోవడంతో ఇంకోటి సిద్ధం చేసినట్లు డైరెక్టర్ చెప్పారు. కచ్చితంగా ఇది ఫ్యాన్స్ తో పాటు మూవీ టీమ్ ని కూడా సర్ ప్రైజ్ చేస్తుందని తెలిపారు. భూల్ భులయ్యా ఫ్రాంచైజ్ లో నెక్స్ట్ పార్ట్ లీడ్ గానే ఈ క్లైమాక్స్ ఉంటుందని తెలుస్తోంది.

మొదటి రెండు భాగాల తరహాలోనే ఈ మూవీ కూడా ఫ్యాన్స్ ని థ్రిల్ కి గురిచేస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. దీపావళి రేసులో ఈ రెండు సినిమాల మధ్యలో గట్టి పోటీ ఉండటం ఖాయం అని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రెండు డిఫరెంట్ జోనర్ సినిమాలు కావడంతో ఆడియన్స్ ఈ రెండింటిని చూడటానికి ఆసక్తి చూపించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Tags:    

Similar News