క్రేజీ హారర్ కామెడీ ఫ్రాంఛైజీలో హిట్ పెయిర్
పార్ట్ 2లో జంటగా నటించిన కార్తీక్- సారా అలీఖాన్ 'భూల్ భూలయ్యా 3'లో తిరిగి జంటగా నటిస్తారు. భూల్ భూలయ్యా అనేది భూషణ్ -కార్తీక్‌లకు ప్రియమైన ఫ్రాంచైజీ.
ఖిలాడీ అక్షయ్ కుమార్ ని రీప్లేస్ చేస్తూ కార్తీక్ ఆర్యన్ తో టీసిరీస్ 'భూల్ భూలయ్యా 2' తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా చారిత్రాత్మక విజయం తర్వాత కార్తీక్ ఆర్యన్, అనీస్ బాజ్మీ, భూషణ్ కుమార్ 'భూల్ భూలయ్యా 3' తెరకెక్కిస్తామని ప్రకటించారు. ఇప్పుడు కార్తీక్ ఆర్యన్ తో ఫ్రాంచైజీని ముందుకు తీసుకెళతున్నారు. ఈ హారర్ కామెడీ ఫిబ్రవరి 2024లో సెట్స్‌పైకి వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. దీపావళి 2024 వారాంతంలో విడుదలవుతుంది. భూల్ భులయ్యా 3 కోసం నిర్మాత భూషణ్ కుమార్ - దర్శకుడు అనీస్ బాజ్మీ నటీనటుల ఎంపికను ప్రారంభించారు.
పార్ట్ 2లో జంటగా నటించిన కార్తీక్- సారా అలీఖాన్ 'భూల్ భూలయ్యా 3'లో తిరిగి జంటగా నటిస్తారు. భూల్ భూలయ్యా అనేది భూషణ్ -కార్తీక్‌లకు ప్రియమైన ఫ్రాంచైజీ. పార్ట్ 3తో లాభాల వాటాను మరింత పెంచాలనుకుంటున్నారు. బడ్జెట్ పెరగనుంది. వారు స్క్రిప్ట్‌ను లాక్ చేయడానికి తీవ్రంగా శ్రమించారు. ఇప్పుడు ఫిబ్రవరి 2024 నుండి ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకురావడానికి అందరూ ఉత్సాహంగా ఉన్నారని సన్నిహిత వర్గాలు తెలిపాయి.
కార్తీక్ - సారా కూడా మళ్లీ ఒకటవడానికి త్వరగా సినిమాను సెట్స్‌పైకి తీసుకురావడానికి ఉత్సాహంగా ఉన్నారు. ఆ ఇద్దరూ ఇప్పటికే గొప్ప స్నేహితులు. భూల్ భూలయ్యా 3తో తమ స్నేహాన్ని వృత్తిపరమైన రంగంలో ఎదుగుదలకు విస్తరించాలని చూస్తున్నారని తెలిసింది. కార్తీక్- సారా అలీఖాన్ అందమైన జంట మరోసారి హారర్ కామెడీలో అద్భుత నటనతో ఆకట్టుకోబోతున్నారని కూడా టీమ్ చెబుతోంది.
భూల్ భులయ్యా 3 ఫిబ్రవరి నుండి 3 నెలల పాటు చిత్రీకరిస్తారు. దీపావళి 2024 సమయంలో భారీగా విడుదలవుతుంది. ఇది భారతదేశంలోని అతిపెద్ద హార్రర్ కామెడీ ఫ్రాంచైజీ.. ఈ జానర్ లో టిసిరీస్ ఒక విశ్వాన్ని విస్తరించడానికి మరొక బ్లాక్‌బస్టర్‌ను సాధించడానికి భారీ పెట్టుబడులు పెడుతోందని తెలిసింది.