ఒక్క హిట్ తో పాన్ ఇండియాకి!
శివ కార్తికేయన్, సాయి పల్లవి తమ నటనతో విమర్శకుల ప్రశంసలందుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా రాజ్ కుమార్ కి పాన్ ఇండియా సినిమా ఛాన్స్ దక్కింది.
ఇటీవల రిలీజ్ అయిన కోలీవుడ్ చిత్రం `అమరన్` ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా రాజ్ కుమార్ పెరియర్ స్వామి తెరకెక్కించిన సినిమా బాక్సాఫీస్ వద్ద 300 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. తమిళ్ తో పాటు తెలుగు ఆడియన్స్ ఈ చిత్రానికి బ్రహ్మరధం పట్టారు. శివ కార్తికేయన్, సాయి పల్లవి తమ నటనతో విమర్శకుల ప్రశంసలందుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా రాజ్ కుమార్ కి పాన్ ఇండియా సినిమా ఛాన్స్ దక్కింది.
బాలీవుడ్ నిర్మాత భూషణ్ కుమార్ పాన్ ఇండియా సినిమా తెరకెక్కించేందుకు రాజ్ కుమార్ తో సంప్రదింపులు జరుపుతున్నారు. హిందీలో తెరకెక్కించి పాన్ ఇండియాలో ఆ సినిమాని రిలీజ్ చేయాలన్నది భూషణ్ కుమార్ ప్లాన్. `అమరన్` మేకింగ్ నచ్చడంతో రాజ్ కుమార్ కి ఈ ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రాజ్ కు మార్ ఇంత వరకూ హిందీ సినిమాలు చేయలేదు. దర్శకుడిగా `అమరన్` రెండవ చిత్రం. దీనికంటే ముందు ఆరేళ్ల క్రితం `రంగూన్` అనే చిత్రాన్ని తెరకెక్కించాడు.
అందులో గౌతమ్ కార్తీక్ హీరోగా నటించాడు. యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ అది. మురగదాస్ ప్రొడక్షన్స్ -పాక్స్ స్టార్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. కానీ ఆ సినిమా అనుకున్నంత గా సక్సెస్ అవ్వలేదు. దీంతో రెండవ సినిమా ఛాన్స్ రావడానికి ఆరేళ్లు సమయం పట్టింది. కానీ `అమరన్` సాలిడ్ హిట్ అయింది. దీంతో నేరుగా పాన్ ఇండియా సినిమాకే ప్రమోట్ అయ్యాడు. మరి ఈ సినిమా కథ ఎలాంటింది? బాలీవుడ్ నటులు ఎవరు? అన్నది తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం భూషణ్ కుమార్ కథ విషయమై దర్శకుడితో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. `అమరన్` వరల్డ్ వైడ్ రిలీజ్ అయింది. కానీ ఇండియాలో మొత్తం సౌత్ కే పరిమితమైంది. బాలీవుడ్ సహా ఇతర భాషల్లోనూ సినిమాను రిలీజ్ చేస్తే ఇంకా మంచి మంచి ఫలితాలు సాధించేదని ట్రేడ్ వర్గాలు అంచనా వేసాయి. ఇప్పుడా కోణంలోనే భూషణ్ కుమార్ కొత్త కథతో రామస్వామిని రంగంలోకి దింపుతున్నారు.