థియేటర్ల కేటాయింపులో మాకు అన్యాయం!
అయితే తాజాగా తమ సినిమాకి అన్యాయం జరిగిందంటూ నిర్మాణ భూషణ్ కుమార్ ఆరోపించారు.
`సింగం ఎగైన్`..`భూల్ భులయ్య-3` చిత్రాలు ఒకేసారి రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. నవంబర్ 1 న రెండు చిత్రాలు ఓసారి రిలీజ్ అయ్యాయి. ఒకేసారి రిలీజ్ కు రావడంతో థియేటర్లు సరిసమానంగా పంచాలనే ప్రపోజల్ ముందే తెరపైకి వచ్చింది. ఆ రకమైన అగ్రిమెంట్ అంతా పక్కాగా జరిగిన తర్వాతే రెండు చిత్రాలు రిలీజ్ అయ్యాయి. అయితే తాజాగా తమ సినిమాకి అన్యాయం జరిగిందంటూ నిర్మాణ భూషణ్ కుమార్ ఆరోపించారు.
ముందుగా మా సినిమా `భూల్ భులయ్య-3` రిలీజ్ తేదిని ప్రకటించాం. ఆ తర్వాత కొన్ని రోజులకు `సింగం ఎగైన్` రిలీజ్ తేదీ ప్రకటించారు. ఇది అన్యాయం. మేము వాళ్లతో ఎన్నోసార్లు చర్చలు జరిపాం. థియేటర్లు సమానంగా పంచాలనే కండీషన్ వాళ్ల ముందు ఉంచాం. మా సినిమా కూడా సింగం ఎగైన్ లాంటి పెద్ద సినిమా కాబట్టి సమన్యాయం కావాలని కోరాం. కానీ థియేటర్ల కేటాయింపు విషయంలో మాకు అన్యాయం జరిగింది.
వారికి ఎక్కువ థియేటర్లు..మాకు తక్కువ థియేటర్లు కేటాయించారు. చివరికి మా సినిమాకి అడ్వాన్స్ బుకింగ్ బాగుంటంతో కొన్ని థియేటర్లు పెంచారు. అంత పెద్ద చిత్రంతో పోటీ పడి మా సినిమా 36 కోట్లకు పైగా ఓపెనింగ్స్ సాధించింది. ఎన్నో వాదనల తర్వాత సింగం ఎగైన్ టీమ్ మా సినిమాకు సహకరిచింది. లేదంటే స్పందించేది కాదేమో. తగినంత సహకారం లేకపోతే మేము ఓటీటీలో రిలీజ్ చేయాల్సిన పరిస్థితి ఉండేది. అది మాకెంతో నష్టంగా మారేది` అని అన్నారు.
సింగం ఎగైన్ భారీ కాన్వాస్ పై తెరకెక్కింది. అందులో తెరంతా పెద్ద పెద్ద స్టార్లే కనిపించారు. కానీ కంటెంట్ రొటీన్ గా ఉండటంతో? మాస్ కి తప్ప చాలా మంది ఆడియన్స్ ని సినిమా నిరుత్సాహ పరించింది. సినిమాకి భారీగా ఖర్చు చేసారు. కేవలం సినిమాకి పెట్టిన పెట్టుబడి మాత్రమే వచ్చినట్లు ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి. భూల్ భులయ్య-3 అందుకు భిన్నంగా తెరకెక్కించి భారీ హిట్ అందుకున్నారు. థియేటర్లు ఇంకా ఎక్కువగా దొరికితే వసూళ్లు పెరిగేవి.