ఒకే రోజు మూడు భారీ సినిమాలు..!

ప్రస్తుత పరిస్థితుల్లో ఒకే రోజు రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తే ఓపెనింగ్స్ విషయంలో కచ్చితంగా ప్రభావం ఉంటుంది.

Update: 2024-11-06 05:34 GMT

ప్రస్తుత పరిస్థితుల్లో ఒకే రోజు రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తే ఓపెనింగ్స్ విషయంలో కచ్చితంగా ప్రభావం ఉంటుంది. అలాంటిది ఏకంగా మూడు సినిమాలు ఒకే రోజు థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తే అవి ఎంతటి విజయాన్ని సొంతం చేసుకున్న వసూళ్ల విషయంలో చాలా పెద్ద డ్యామేజ్ క్రియేట్‌ అవుతుంది. అందుకే నిర్మాతలు ముందస్తు ఒప్పందాలు చేసుకుంటూ ఒక సినిమా తర్వాత మరోటి అన్నట్లుగా విడుదల చేస్తూ వస్తున్నారు. కానీ ఓటీటీ ద్వారా విడుదల చేస్తే ఆ సమస్య ఏమీ ఉండదు. అందుకే ఓటీటీ ద్వారా ఈ మధ్య కాలంలో వరుసగా భారీ సినిమాలు ఒకే రోజున స్ట్రీమింగ్‌ అవ్వడం మనం చూస్తూ ఉన్నాం.

ఈ వారంలో తెలుగు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు మూడు పెద్ద సినిమాలు రాబోతున్నాయి. అందులో మొదటిది ఎన్టీఆర్‌ హీరోగా, జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన 'దేవర' సినిమా. ఆరు వారాల క్రితం వచ్చిన దేవర సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్‌ వద్ద దాదాపుగా రూ.400 కోట్ల వసూళ్లను సొంతం చేసుకుంది. థియేటర్ల ద్వారా భారీ ఎత్తున జనాలు చూసినా ఇంకా ఓటీటీ ద్వారా చూడటం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నెట్‌ ఫ్లిక్స్‌లో ఈ సినిమాను స్ట్రీమింగ్‌ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. మరోసారి దేవర మాస్ జాతర కోసం ఫ్యాన్స్‌ ఎదురు చూస్తున్నారు.

దేవర సినిమాతో పాటు ఈ వారం ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మరో పెద్ద సినిమా సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా, జై భీమ్‌ దర్శకుడు జ్ఞానవేల్‌ దర్శకత్వంలో రూపొందిన వేట్టయాన్‌. ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద భారీ విజయం దక్కింది. తమిళ బాక్సాఫీస్ వద్ద రూ.350 కోట్లకు పైగా వసూళ్లు చేసిన వేట్టయాన్‌ సినిమా తెలుగు బాక్సాఫీస్‌ వద్ద మాత్రం నిరాశ పరిచింది. అయితే సినిమాకు ఓటీటీ ద్వారా మంచి రెస్పాన్స్ దక్కే అవకాశం ఉంది. సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ వంటి స్టార్‌ హీరోల సినిమాలను థియేటర్‌లో కాకున్నా ఓటీటీ ద్వారా అయినా చూడాలని ప్రేక్షకులు కోరుకుంటారు. అందుకే ఈ సినిమాకు ఓటీటీ ద్వారా మంచి స్పందన దక్కే అవకాశం ఉంది. ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ కానుంది.

మలయాళ స్టార్‌ నటుడు టోవినో థామస్‌ నటించిన ఏఆర్‌ఎం దాదాపు రెండు నెలల తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్‌ కి సిద్ధం అయింది. ఈ సినిమాలో తెలుగు ప్రేక్షకుల ఫేవరేట్‌ స్టార్‌ హీరోయిన్‌ కృతి శెట్టి నటించడం ద్వారా అంచనాలు పెరిగాయి. ఉప్పెన సినిమాతో బేబమ్మగా అలరించిన ఈ అమ్మడు ఆ తర్వాత చాలా సినిమాలు నటించింది. అందులో కొన్ని నిరాశ పరడంతో మలయాళంలో ఈ అమ్మడు ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. కృతి శెట్టి ఉన్న కారణంగా ఏఆర్‌ఎం కి తెలుగు లో మంచి క్రేజ్ దక్కింది. కనుక ఓటీటీ ద్వారానూ సినిమాకు మంచి స్పందన వచ్చే అవకాశాలు ఉన్నాయి. తెలుగు బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచిన ఈ సినిమా ఓటీటీలో హిట్ అయ్యేనా చూడాలి.

Tags:    

Similar News