బిగ్ బాస్ కంటెస్టెంట్ కు టీటీడీ కొరడా తప్పదా..?

Update: 2024-11-27 12:47 GMT

తెలుగు సీరియల్ నటి బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్ ప్రియాంక జైన్ మీద టీటీడీ చాలా సీరియస్ గా ఉంది. బుల్లితెర నటిగా బాగా పాపులర్ అయిన ఆమె తనకు సంబంధించిన అన్ని విషయాలను వీడియోల ద్వారా పెడుతూ తన యూట్యూబ్ ఛానెల్ ను నిర్వహిస్తున్నారు. అందులో ఎక్కువగా ప్రాంక్ వీడియోలు ఆమె చేస్తుంటారు. తన లవర్ శివ్ కుమార్ తో ప్రియాంక జైన్ చేస్తున్న వీడియోలు ఆమె ఫాలోవర్స్ ని ఆకట్టుకుంటున్నాయి.

ఐతే ఒక్కోసారి ఇవి శృతిమించడం వల్ల అనుకోని పర్యావసానాలు ఎదుకోవాల్సి వస్తుంది. ప్రియాంక జైన్ ఎప్పటిలానే ఒక ప్రాంక్ చేసింది. ఐతే ఆమె ప్రాంక్ చేయడం తప్పు కాదు కానీ అది చేసింది ఒక సెన్సిటివ్ ఇష్యూ మీద. అది కూడా కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి మెట్ల దారిలో.. ప్రియాంక, శివ్ లు మెట్ల దారి గుండా తిరుమల వెళ్తూ ఒక ప్రాంక్ ప్లాన్ చేశారు. వారు లక్ష్మి నరసింహ స్వామి ఆలయం దగ్గర రాగానే చిరుత అంటూ ఒక వీడియో చేశారు. అది ప్రాంక్ వీడియోనే అయినా తిరుమల కొండ మీద చిరుత అనేసరికి చాలా సెన్సిటివ్ ఇష్యూ అవ్వడం వల్ల వైరల్ అయ్యింది.

ఆ వీడియో అటు తిరిగి ఇటు తిరిగి టీటీడీ దృష్టికి వెళ్లింది. ఈ క్రమంలో ఈ ప్రాంక్ పై ప్రియాంక జైన్ ఇంకా శివ్ ల మీద టీటీడీ సీరియస్ అయ్యింది. ఈ విషయంపై టీటీడీ పాలక మండలి సభ్యుడు, బీజేపీ నాయకుడు భాను ప్రకాష్ రెడ్డి రెస్పాండ్ అయ్యారు. పవిత్రమైన గుడి ప్రదేశంలో ఇలాంటి పనులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటమని అన్నారు. తిరుమల మెట్ల మార్గంలో ప్రాంక్ చేసిన కారణంగా ప్రియాంక, శివ్ ల మీద కేసు పెట్టాలని ఆయన అన్నారు.

ఐతే ఈ ఇష్యూ గురించి ఇప్పటివరకు ప్రియాంక. శివ్ ల నుంచి ఎలాంటి స్పందన లేదు. సరదాగా చేసినా సరే తప్పు తప్పే కాబట్టి ఈ విషయంలో ప్రియాంక జైన్, శివ్ లకు టీటీడీ నుంచి అంక్షింతలు తప్పేలా లేవు. వారిని మందలించి వదిలేస్తారా లేదా ఈ మ్యాటర్ కేసులు, పోలీస్ స్టేషన్ ల దాకా తీసుకెళ్తారా అన్నది చూడాలి. ఏది ఏమైనా బిగ్ బాస్ కంటెస్టెంట్ ప్రియాంకాకు ఇది అనవసరమైన తలనొప్పే అని చెప్పొచ్చు.

Tags:    

Similar News