బిగ్ బాస్ 8 : నామినేషన్స్ ఫైట్.. ఎవరికి ఎవరు తగ్గట్లేదుగా..!
ఈ వారం నామినేషన్స్ లో హరితేజ, నిఖిల్, ప్రేరణ, యష్మి, గౌతం, పృధ్వి, విష్ణు ప్రియ ఉన్నారు.
బిగ్ బాస్ షోలో నామినేషన్స్ అనేవి చాలా కీలకం. హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వడానికి ఉన్న ఒకే ఒక్క అవకాశం వాళ్లని నామినేట్ చేయడమే అందుకే వారం మొత్తం కంటెస్టెంట్స్ ఆడిన ఆటను చూసి అందులో వారు చేసిన తప్పులను ఎంచుకుని నామినేషన్స్ వేస్తారు. ఐతే ఇందులో రివెంజ్ నామినేషన్స్ చాలా కామన్ అయ్యాయి. హౌస్ లో తమకు పడని కంటెస్టెంట్స్ ని నామినేట్ చేయడం వారి మీద ఏదో ఒక కారణం చెప్పడం లాంటివి జరుగుతుంటాయి.
ఎప్పటిలానే సోమవారం నామినేషన్స్ జరిగాయి. ఐతే ఎప్పుడు ఒక కంటెస్టెంట్ ఇద్దరిని నామినేట్ చేయాల్సి ఉండగా ఈసారి బిగ్ బాస్ కేవలం ఒక్కరిని మాత్రమే సరైన కారణాలు చెప్పి నామినేట్ చేయాలని అంటాడు. ఈ క్రమంలో ముందు పృధ్విని నామినేషన్స్ స్టార్ట్ చేయమని బిగ్ బాస్ చెప్పగా అతను నెక్ ఫాంటసీ కారణం చేత రోహిణిని నామినేట్ చేశాడు. వాళ్లిద్దరి మధ్య వాదన జరిగింది. హరితేజ ప్రేరణని, ప్రేరణ హరితేజను నామినేట్ చేసుకున్నారు.
హరితేజ వర్సెస్ ప్రేరణ కూడా మాటల యుద్ధం ఒక రేంజ్ లో జరిగింది. ఇద్దరు కూడా ఎవరు తగ్గకుండా మాటలతో పోట్లాడుకున్నారు. ఐతే ఇక్కడితో దీన్ని ఆపేద్దాం అని నామినేషన్స్ తర్వాత ఇద్దరు చెప్పుకోవడం విశేషం. ఇక మరోపక్క నిఖిల్ గౌతం ని నామినేట్ చేస్తూ ఒక పర్సన్ వద్దు అని చెప్పినప్పుడు ఆగిపోవాలని యష్మిని అక్క అన్న సందర్భాన్ని తెచ్చి ప్రస్తావించాడు. నిఖిల్ గౌతం ల మధ్య దాదాపు చిన్న పాటి గొడవ లాంటి వాదనే జరిగింది.
ఇద్దరు కూడా బిగ్ బాస్ గేటు దగ్గరకు వచ్చి వెళ్లిపోదామని అనుకున్నారు. గంగవ్వ యష్మిని నామినేట్ చేయగా.. విష్ణు ప్రియని నబీల్ నామినేట్ చేశాడు. స్మోకింగ్ జోన్ లో ఉంటున్నాడని బిగ్ బాస్ ని అగౌరవపరచాడని పృధ్విని తేజ నామినేట్ చేశాడు. ఐతే అవినాష్ మెగా చీఫ్ అయిన కారణంగా నామినేషన్స్ లో ఉన్న ఒకరిని సేవ్ చేసి మరొకరిని స్వాప్ చేయమని బిగ్ బాస్ చెప్పాడు. అప్పుడు అవినాష్ రోహిణిని సేవ్ చేసి నిఖిల్ ని నామినేషన్స్ లో ఉంచాడు.
అవినాష్ స్వాప్ చేసిన తర్వాత ఫైనల్ గా ఈ వారం నామినేషన్స్ లో హరితేజ, నిఖిల్, ప్రేరణ, యష్మి, గౌతం, పృధ్వి, విష్ణు ప్రియ ఉన్నారు. మరి వీరిలో ఎవరు ఈ వీకెండ్ హౌస్ కి గుడ్ బై చెబుతారో చూడాలి.