బిగ్ బాస్ సోనియా పెళ్లి.. పెద్దోడు చిన్నోడు ఎక్కడ..?
ఫైనల్ గా బయటకు వచ్చిన సోనియా యష్ తో ఎంగేజ్మెంట్ జరుపుకుంది. శుక్రవారం వీరి మ్యారేజ్ కూడా జరిగింది.
బిగ్ బాస్ సీజన్ 8 లో ఉన్న నాలుగైదు వారాల్లో అయినా తన మార్క్ చూపించేసింది సోనియా ఆకుల. ఆర్జీవి సినిమాల్లో హీరోయిన్ గా నటించి గుర్తింపు తెచ్చుకున్న ఆమె ఒక స్వచ్చంధ సేవా సంస్థ కూడా నడిపిస్తుందని తెలిసి ఆమె మీద ఆడియన్స్ కు రెస్పెక్ట్ పెరిగింది. బిగ్ బాస్ సీజన్ 8 లో వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కనిపించిన ఆమె హౌస్ లో వెళ్లిన రెండో వారం లోనే నిఖి, పృధ్విలతో బాగా క్లోజ్ అయ్యింది. ఒక దశలో ఆమె ఏం చెబితే అది చేసేలా వాళ్లిద్దరు తయారు అయ్యారు. ముందు వాళ్లిద్దరితో క్లోజ్ గా ఉంటూ లవ్ స్టోరీ నడిపిస్తుందా అన్న డౌట్ రాగా సడెన్ గా పెద్దోడు చిన్నోడు అంటూ మాట మార్చేసింది.
అంతేకాదు తనకు యష్ తో ఉన్న లవ్ స్టోరీని చెప్పింది. బయటకు వెళ్లాక పెళ్లి చేసుకోవాలని కూడా అన్నది. అంతా బాగుంది కానీ సోనియా నిఖిల్ పృధ్వి ఈ ముగ్గురి మధ్య మొదటి మూడు వారాలు జరిగిన డిస్కషన్ సోనియా మీద నెగిటివిటీ వచ్చేలా చేసింది. వాళ్లిద్దరిని ఆడించేస్తుంది అన్న టాక్ వచ్చింది. ఆ నెగిటివిటీ వల్లే సోనియా ఎలిమినేట్ అయ్యింది. ఆమె వెళ్లాకనే నిఖిల్, పృధ్వి అసలు ఆటలో నిమగ్నమయ్యారు.
ఐతే బయటకు వచ్చిన సోనియా మళ్లీ హౌస్ లో 12వ వారం నామినేషన్స్ కోసం వెళ్లి నిఖిల్ ని నామినేట్ చేసింది. ఆ టైం లో సోనియా నిఖిల్ ని ఇరికించే ప్రయత్నం చేసింది. నామినేట్ చేసి మళ్లీ చివర్లో నువ్వు గెలవాలని అనుకుంటున్నా అన్నది. ఐతే సోనియా ఈ డబుల్ స్టాండర్డ్ ఏంటో నిఖిల్ కి అర్ధం కాలేదు. ఫైనల్ గా బయటకు వచ్చిన సోనియా యష్ తో ఎంగేజ్మెంట్ జరుపుకుంది. శుక్రవారం వీరి మ్యారేజ్ కూడా జరిగింది.
సోనియా మ్యారేజ్ కి పెద్దోడు చిన్నోడు అదే నిఖిల్, పృధ్విలు అటెండ్ అయినట్టు కనిపించలేదు. బిగ్ బాస్ సీజన్ 8 ఫైనల్ ఎపిసోడ్ తర్వాత వీళ్లు మళ్లీ కలిసినట్టు లేరు. సోనియా మ్యారేజ్ కి సీజన్ 8 కంటెస్టెంట్స్ తేజ, రోహిణి అటెండ్ అయ్యారు. వారితో పాటు అమర్ దీప్, తేజశ్విని కూడా వచ్చారు. కానీ నిఖిల్, పృధ్విలు మాత్రం రాలేదు. మరి పెద్దోడు చిన్నోడు సోనియా మ్యారేజ్ కు అటెండ్ అవ్వకపోవడానికి వెనక రీజన్స్ ఏంటో కానీ వీళ్ల ముగ్గురి మధ్య ఏం జరిగింది అని ఆడియన్స్ అనుకుంటున్నారు. సోనియా మాత్రం ఎంచక్కా తన ప్రేమికుడు యష్ ని పెళ్లాడి కొత్త జీవితాన్ని మొదలు పెట్టింది.