బిగ్ బాస్ 8 : నిఖిల్ లో మార్పుని గమనించారా..?

బిగ్ బాస్ సీజన్ 8 లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన నిఖిల్ మొదటి రెండు వారాల్లో తమ ఆట తీరుతో అందరినీ సర్ ప్రైజ్ చేశాడు.

Update: 2024-10-02 11:30 GMT

బిగ్ బాస్ సీజన్ 8 లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన నిఖిల్ మొదటి రెండు వారాల్లో తమ ఆట తీరుతో అందరినీ సర్ ప్రైజ్ చేశాడు. టైటిల్ రేసులో ఉంటాడని అనుకున్న నిఖిల్ సోనియా తో ఫ్రెండ్ షిప్ ఆటలో వెనకబడేలా చేసింది. హౌస్ అంతా ఒక మాట అయితే నిఖిల్ మాత్రం సోనియా చెప్పిందే తన మాట అనేలా చేశాడు. సోనియా వల్లే నిఖిల్ ఆట చెడిపోతుందని అతన్ని సపోర్ట్ చేసే ఫ్యాన్స్ కూడా అనుకున్నారు. వచ్చిన రెండు మూడు వారాల్లోనే నిఖిల్ ని సోనియా పూర్తిగా తన కంట్రోల్ లో పెట్టుకుంది.

ఐతే 4వ వారం సోనియా ఎలిమినేట్ అవ్వడం నిఖిల్ ఫ్యాన్స్ ని ఖుషి చేసింది. అంతేకాదు నిఖిల్ కు ఇక మీదట ఆటలో అడ్డు ఉండదని అనుకున్నారు. అందుకు తగినట్టుగానే ఈ వారం టాస్కుల్లో నిఖిల్ అదరగొడుతున్నాడు. సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ ఛాలెంజ్ లో భాగంగా మంగళవారం ఒక టాస్క్ లో పూల్ లో దూకి టైర్స్ అన్ లాక్ చేసే టాస్క్ లో నిఖిల్ పెర్ఫార్మెన్స్ మెప్పించింది. నిఖిల్ నుంచి ఆశించేది ఇది కదా అని ఆడియన్స్ కూడా అనుకుంటున్నారు.

సోనియా ఇంకా హౌస్ లో ఉండి ఉంటే కచ్చితంగా నిఖిల్ ఆట మీద ఎఫెక్ట్ పడేది. కానీ ఆమె ఎలిమినేట్ అవ్వడం వల్ల తన స్ట్రెంత్ ని తెలుసుకున్న నిఖిల్ కంబ్యాక్ ఇచ్చినట్టే అనిపిస్తున్నాడు. అంతేకాదు ఈ సీజన్ మొదటి వారం నుంచి ఐదో వారం వరకు క్లాన్ చీఫ్ గా నిఖిల్ ఒక్కడే కంటిన్యూగా కొనసాగుతున్నాడు. సో హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ నిఖిల్ అని చెప్పడానికి ఇదొక ఉదహరణ అని చెప్పొచ్చు.

బిగ్ బాస్ సీజన్ 8 లో ఈ వీకెండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయని తెలుస్తుంది. ఐతే ఈసారి వైల్డ్ కార్డ్ గా కొత్త వారు కాకుండా ఆల్రెడీ ఇదివరకు సీజన్లలో ఉన్న వారినే పంపిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఎవరెవరు వస్తున్నారు అన్నది ఎనిమిది మంది లిస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బిగ్ బాస్ సీజన్ 8 ఆరో వారం నుంచి డబుల్ ఎంటర్టైన్మెంట్ తో ఉండబోతుందని తెలుస్తుంది.

Tags:    

Similar News