బిగ్ బాస్ 8 : వాళ్లే టార్గెట్ గా నామినేషన్స్.. ఫ్యూజులు అవుట్ అయ్యేలా..!

ఐతే ఈసారి బిగ్ బాస్ సీజన్ 8 లో సర్ ప్రైజ్ గా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ వచ్చి నామినేషన్ వేస్తున్నారు.

Update: 2024-11-19 05:23 GMT

బిగ్ బాస్ సీజన్ 8 లో ఈసారి నామినేషన్స్ ని వెరైటీగా ప్లాన్ చేశాడు బిగ్ బాస్. ఎప్పుడు హౌస్ లో ఉండే మిగతా కంటెస్టెంట్స్ ఎవరైతే హౌస్ లో ఉండేందుకు అర్హత లేదని అనుకుంటారో వాళ్లనే నామినేట్ చేస్తారు. ఐతే ఈసారి బిగ్ బాస్ సీజన్ 8 లో సర్ ప్రైజ్ గా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ వచ్చి నామినేషన్ వేస్తున్నారు. అలా మొదట సోనియా హౌస్ లోకి వచ్చి నామినేషన్స్ మొదలు పెట్టింది.

తన మొదటి నామినేషన్ ప్రేరణని చేసింది. ఆమె మిగతా హౌస్ మెట్స్ తో అమర్యాదగా మాట్లాడుతుందని.. తన కోసం మాత్రం గ్రూప్ గేమ్ తన వరకు వస్తే మాత్రం అది పర్సనల్ ఆట ఆడుతుందని ప్రేరణ చేస్తున్న తప్పులను బహిర్గతం చేసింది. దాదాపు ప్రేరణ సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో వచ్చేలా చేసింది సోనియా. మరో నామినేషన్ గా సోనియా నిఖిల్ ని నామినేట్ చేసింది.

నిఖిల్ చేసిన నామినేషన్ ఏది కూడా అంత విలువైనదిగా లేదని. గౌతం విషయంలో, తేజ విషయంలో తను చేసిన నామినేషన్స్ కరెక్ట్ కాదని చెప్పింది. అంతేకాదు యష్మి మీద తనకు ఎలాంటి ఫీలింగ్స్ లేనప్పుడు ఆమెకు చెప్పాల్సిందని అన్నది. ఐతే నిఖిల్ యష్మి మీద ఫీలింగ్ లేదని చెప్పగా యష్మి కూడా నిఖిల్ మీద ఫైర్ అయ్యింది. అలా సోనియా ప్రేరణ, నిఖిల్ ని నామినేట్ చేయగా ఆ తర్వాత వచ్చిన బేబక్క పృధ్వి, నిఖిల్ లను నామినేట్ చేసింది.

శేఖర్ బాషా కూడా నామినేషన్స్ వేసేందుకు హౌస్ లోకి వచ్చాడు. అతను యష్మి, ప్రేరణని నామినేట్ చేశాడు. మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారని ఆడియన్స్ కు అర్ధమైందని నిఖిల్, యష్మి, పృధ్వి, ప్రేరణకు చెప్పాడు. యష్మిని టార్గెట్ చేస్తూ ప్రేరణ ని ఎందుకు ఒక్కసారి కూడా నామినేట్ చేయలేదని అన్నాడు. అలా వచ్చిన ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ కూడా యష్మి, నిఖిల్ ప్రేరణ, పృధ్వి ఈ నలుగురిని మాత్రమే టార్గెట్ చేస్తూ నామినేషన్స్ వేశారు.

బిగ్ బాస్ ఇన్ని సీజన్లలో ఎప్పుడు లేనిది ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ తో నామినేషన్స్ వేయడం ఈ సీజన్ లో కొత్తగా ఉంది. ఐతే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ వారి పర్సనల్ ఒపీనియన్ లేదా వారికి పడని హౌస్ మేట్స్ నే నామినేట్ చేస్తారు కదా అన్న సందేహం కూడా ఉంది. ఐతే బిగ్ బాస్ ప్లాన్ లో భాగంగా ఈసారి అలా ఫిక్స్ అయ్యారని చెప్పొచ్చు. సోమవారం కేవలం ముగ్గురు నామినేషన్స్ మాత్రమే పూర్తి కాగా నేడు కూడా ఈ నామినేషన్స్ ప్రక్రియ కొనసాగుతుందని తెలుస్తుంది.

Tags:    

Similar News