బిగ్ బాస్ 8 : నిఖిల్ వర్సెస్ గౌతం.. రంగు పడింది ఎవరికి..?
బిగ్ బాస్ సీజన్ 8 మరో వారం రోజులు ఉంది అనగా హౌస్ లో చివరి టాస్క్ అది కూడా ఆడియన్స్ కు ఓట్ అప్పీల్ చేసేందుకు పెట్టారు.
బిగ్ బాస్ సీజన్ 8 మరో వారం రోజులు ఉంది అనగా హౌస్ లో చివరి టాస్క్ అది కూడా ఆడియన్స్ కు ఓట్ అప్పీల్ చేసేందుకు పెట్టారు. ఈ వారం మొత్తం ఓట్ అప్పీల్ కోసమే రకరకాల టాస్క్ పెట్టగా అందులో ప్రేరణ, నబీల్, విష్ణు ప్రియ ఓట్ అప్పీల్ చేశారు. ఇక శుక్రవారం రోహిణి, నిఖిల్, గౌతం లకు ఒక టాస్క్ ఇచ్చి అందులో గెలిచిన వారికి ఓట్ అప్పీల్ చేసే ఛాన్స్ ఉంటుందని బిగ్ బాస్ చెప్పాడు. ఐతే రెండు రౌండ్లు పెట్టిన ఈ టాస్క్ లో మొదటి రౌండ్ సాండ్ కేక్ కటింగ్ లో రోహిణి ఓడిపోగా ఆమె ఈ టాస్క్ నుంచి నిష్క్రమించింది.
ఇక రెండో టాస్క్ గా రంగు పడుద్ది అంటూ షర్ట్ మీద రంగు అద్దాల్సి ఉంటుంది. ఈ టాస్క్ లో మూడు రౌండ్లు ఉండగా మొదటి రౌండ్ గౌతం గెలిస్తే మిగతా రెండు రౌండ్లలో నిఖిల్ గెలిచాడు. ఈ టాస్క్ ఆడే టైం లో మరోసారి గౌతం, నిఖిల్ మధ్య వాదన జరిగింది. గౌతం తన ముఖం మీద చేతితో కొట్టాడని నిఖిల్ ఆరోపించాడు. నువ్వు కూడా తోసేశావ్ అని గౌతం వాదన జరిపాడు. ఈ టాస్క్ సంచాలక్ గా ఉన్న ప్రేరణ మీద కూడా గౌతం అరిచాడు.
ఐతే టాస్క్ ముగిశాక మళ్లీ ఇద్దరు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకున్నారు. ఈ టాస్క్ గెలిచినందుకు నిఖిల్ కు ఆడియన్స్ కు ఓట్ అప్పీల్ చేసుకునే ఛాన్స్ వచ్చింది. ఇక తన ఆట గురించి చెబుతూ ఏవైనా చిన్న చిన్న తప్పులు చేసుంటే మీ ఇంటి వాడిని అనుకుని తనకు ఓట్ వేసి గెలిపించాలని నిఖిల్ అన్నాడు. మొత్తానికి ఈ టాస్క్ విన్ అయ్యి మరోసారి నిఖిల్ తాను టాస్కుల్లో ఎంత టఫ్ ఫైటర్ అన్నది ప్రూవ్ చేసుకున్నాడు.
శుక్రవారం ఎపిసోడ్ లో స్టార్ యాంకర్, హోస్ట్ ఓంకార్ హౌస్ లోకి వచ్చాడు. ఇస్మార్ట్ జోడీ సీజన్ 3 గురించి ప్రమోట్ చేయడానికి వచ్చిన అతను హౌస్ మెట్స్ కి ఒక టాస్క్ ఇచ్చాడు. అందులో ప్రేరణ, నబీల్ జట్టు విన్ అవగా ప్రేరణ పెళ్లి వీడియో ప్లే చేశారు. అంతేకాదు ప్రేరణకు ఒక బంపర్ ఆఫర్ కూడా ఇచ్చాడు. శ్రీపాద్ తో కలిసి ఇస్మార్ట్ జోడీ సీజన్ 3 లో కి రావాలని కోరాడు. బిగ్ బాస్ పూర్తి కాగానే ఆ సీజన్ మొదలవుతుంది. సో ప్రేరణ కి వెంటనే లక్కీ ఛాన్స్ దొరికిందని చెప్పొచ్చు.