బిగ్ బాస్ 8 : షాకింగ్ ఎలిమినేషన్.. ఆడియన్స్ మైండ్ బ్లాక్..!

బిగ్ బాస్ సీజన్ 8 లో ప్రతి సండే ఒక ఎలిమినేషన్ జరుగుతుంది. హౌస్ లో పెర్ఫార్మెన్స్ తో బయట ఉన్న ఆడియన్స్ మనసులు గెలిచిన వారే నామినేషన్స్ నుంచి సేవ్ అవుతారు.

Update: 2024-10-12 06:30 GMT

బిగ్ బాస్ సీజన్ 8 లో ప్రతి సండే ఒక ఎలిమినేషన్ జరుగుతుంది. హౌస్ లో పెర్ఫార్మెన్స్ తో బయట ఉన్న ఆడియన్స్ మనసులు గెలిచిన వారే నామినేషన్స్ నుంచి సేవ్ అవుతారు. ఇప్పటికే ఐదు వారాలు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ సీజన్ 8 లో ఆరుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. ఇక ఈ వారం నామినేషన్స్ లో ఆరుగురు ఉండగా వారిలో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది. ఐతే బిగ్ బాస్ లీక్స్ లో భాగంగా ఆదివారం హౌస్ ని వీడే కంటెస్టెంట్ ఎవరన్నది లీక్ అయ్యింది.

బిగ్ బాస్ సీజన్ 8 లో ఈ వారం షాకింగ్ ఎలిమినేషన్ జరిగినట్టు తెలుస్తుంది. నామినేషన్స్ లో విష్ణు ప్రియ, సీత, పృధ్వి, యష్మి, మెహబూబ్, గంగవ్వ ఉండగా లీస్ట్ ఓటింగ్ వచ్చిన సీత హౌస్ నుంచి బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. ఐతే సీత ఎలిమినేషన్ ఆడియన్స్ కు షాక్ ఇస్తుందని చెప్పొచ్చు. బిగ్ బాస్ సీజన్ 8 లో సీత తన పెర్ఫార్మెన్స్ తో మెప్పిస్తుంది. ఐతే రెండు వారాలుగా ఆమె ఆటల్లో అంత చురుగ్గా పాల్గొనలేకపోతుంద్.

అంతేకాదు ఎందుకో సీత ఈమధ్య అంత యాక్టివ్ గా కనిపించట్లేదు. దాని వల్లే సీత ఈ వారం నామినేషన్స్ లో ఉంది. అంతేకాదు ఈ వారం ఆమె ఎలిమినేట్ అవ్వడానికి కూడా అవే కారణాలని తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 8 లో సీత ఎలిమినేషన్ వల్ల పాత కంటెస్టెంట్స్ లో మరో హౌస్ మేట్ బయటకు వచ్చినట్టు అవుతుంది. లాస్ట్ వీక్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ జరగ్గా వారి నుంచి గంగవ్వ, మెహబూబ్ నామినేట్ అయినా వారిద్దరు ఈ వారం సేవ్ అయ్యారు.

బిగ్ బాస్ సీజన్ 8 లో ఆరో వారం ఎలిమినేషన్ ప్రాసెస్ ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది. సీత టాప్ 5 లో ఉంటుందని అనుకున్న ఆడియన్స్ ఆమె ఎలిమినేషన్ ను ఊహించలేకపోయారు. ఐతే ఉన్నంతవరకు సీత తన ఆట తీరుతో ఆడియన్స్ ని మెప్పించింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా ఈసారి గట్టి ఫైట్ ఇచ్చేలా ఉన్నారు.

Tags:    

Similar News