కింగ్‌కు ఇక రెస్ట్ ఇచ్చేస్తున్నారా?
త్వరలో సీజన్ 9 ప్రారంభం కానున్న నేపథ్యంలో మరోసారి హోస్ట్‌గా నాగార్జునని తప్పించడం ఖాయం అంటూ వార్తలు షికారు చేయడం మొదలైంది.;

బిగ్‌బాస్ రియాలిటీ షోకు తెలుగు రాష్ట్రాల్లో భారీ క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. ఈ షోకు ఎంత క్రేజ్ ఉందో అదే స్థాయి వివాదాలు కూడా చుట్టుముట్టడం తెలిసిందే. తొలి సీజన్ నుంచి సీజన్ 8 వరకు ఈ షో సాంతం వివాదాల మయంగా మారి నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఫస్ట్ సీజన్‌ని లోనావాలాలో వేసిన ప్రత్యేక సెట్‌లో నిర్వహించారు. ఆ తరువాత సెకండ్ సీజన్‌కు హోస్ట్‌గా నేచురల్ స్టార్ నాని స్టేజ్‌పైకి రావడం తెలిసిందే.
సీజన్ 3 నుంచి కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తూ వస్తున్నారు. సీజన్ 6 అట్టర్ ఫ్లాప్ కావడం, నాగార్జునపై సీపీఐ నారాయణ సంచలన ఆరోపణలు చేయడంతో సీజన్ 7 నుంచి నాగార్జునని హోస్ట్‌గా తప్పిస్తారనే ప్రచారం జరిగింది. కానీ ఆ మార్పు జరగలేదు. అది ఒట్టి ప్రచారం మాత్రమేనని తేలడంతో సీజన్ 7,8కు నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించారు. త్వరలో సీజన్ 9 ప్రారంభం కానున్న నేపథ్యంలో మరోసారి హోస్ట్‌గా నాగార్జునని తప్పించడం ఖాయం అంటూ వార్తలు షికారు చేయడం మొదలైంది.
కింగ్‌కు ఇక రెస్ట్ ఇచ్చేస్తున్నారని, ఆయన స్థాయిలో నందమూరి బాలకృష్ణ హోస్ట్ పగ్గాలు అందుకోబోతున్నారని ప్రచారం ఊపందుకుంది. బాలయ్య హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన దగ్గరి నుంచి బిగ్‌బాస్ హోస్ట్ గా బాలయ్యే రావాలంటూ సర్వత్రా డిమాండ్ మొదలైంది. నాగ్ హోస్టింగ్ చూసీ చూసీ బోర్ కొట్టిందని, ఇక నుంచి బాలయ్యను ఆస్థానంలో చూడాలనుకుంటున్నామని గత కొంత కాలంగా పఆడియన్స్ డిమాండ్ చేస్తున్నారు.
ప్రేక్షకులు మార్పుని కోరుకుంటుండటంతో నిర్వాహకులు కూడా బిగ్‌బాస్ సీజన్ 9 కు హోస్ట్‌గా బాలయ్యను ఫైనల్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. ఈ షోకు బాలయ్య లాంటి మాస్ హీరో యాడ్ అయితే మాస్ ప్రేక్షకులతో ఈ షోకు వీవర్ మరింతగా పెరిగి టీఆర్పీ కూడా రికార్డు స్థాయిలో రావడం గ్యారంటీ అని భావిస్తున్నారట. ఇప్పటికే యాజమాన్యం హీరో బాలకృష్ణతో చర్చులు జరుపుతోందని, అవి ఓ కొలిక్కి రాగానే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.