బిగ్‌బాస్‌8 : మొదటి టాస్క్‌ రచ్చ... వర్మ హీరోయిన్‌ ఫైర్‌ బ్రాండ్‌

గత సీజన్‌ల మాదిరిగానే ఈ సీజన్‌ కూడా కంటెస్టెంట్స్ విషయంలో విమర్శలతో ప్రారంభం అయ్యింది.

Update: 2024-09-03 05:47 GMT

గత సీజన్‌ల మాదిరిగానే ఈ సీజన్‌ కూడా కంటెస్టెంట్స్ విషయంలో విమర్శలతో ప్రారంభం అయ్యింది. హౌస్‌ లోకి ఒకొక్క కంటెస్టెంట్‌ వెళ్తూ ఉంటే ఎవర్రా మీరంతా అంటూ ప్రేక్షకులు జుట్టు పీక్కుంటున్నట్లు సోషల్‌ మీడియాలో మీమ్స్ వచ్చాయి. నెట్టింట ఒక్కరు ఇద్దరు తప్ప పెద్దగా తెలిసిన కంటెస్టెంట్స్ లేరు అంటూ విమర్శలు మొదలయ్యాయి. మరో వైపు బిగ్‌ బాస్ మొదటి రోజే హౌస్ లో హీట్‌ పెంచాడు. ఈ సీజన్‌ కు కెప్టెన్‌ ఉండడు అంటూ ముందుగానే ప్రకటించిన బిగ్‌ బాస్ ముగ్గురు చీఫ్ లు ఉంటారని మాత్రం చెప్పాడు. ప్రారంభ ఎపిసోడ్‌ టాస్క్‌ లను బేస్ చేసుకుని మరో రెండు టాస్క్‌ లు పెట్టి ముగ్గురు చీఫ్‌ లను ఎంపిక చేయడం జరిగింది.

ఎపిసోడ్‌ ప్రారంభంలోనే తనను ఎలిమినేట్‌ చేసేందుకు ఓటు వేసిన వారిపై నాగ మణికంఠ ఆగ్రహం వ్యక్తం చేయడం మొదలుకుని మెల్ల మెల్లగా ఎపిసోడ్‌ స్టార్ట్ అయ్యింది. శేఖర్‌ బాషా కు వర్మ కంపెనీ నుంచి ఎంట్రీ ఇచ్చిందని ప్రచారం జరుగుతున్న సోనియా కు మధ్య ఆరెంజ్ విషయంలో గొడవ జరిగింది. ఆ గొడవ వెంటనే క్లోజ్ చేసుకున్న ఇద్దరు గేమ్‌ లోకి వెళ్లి పోయారు. మరో వైపు కిచెన్‌ లో కూడా బేబక్క ఇంకా సోనియా గొడవ పడ్డారు. అందరూ ఆకలితో ఉంటే బాధ్యత లేకుండా బేబక్క ప్రవర్తిస్తుంది అంటూ సోనియా చేసిన వ్యాఖ్యలు పెద్ద గొడవకి దారి తీస్తుందేమో అని అంతా అనుకున్నారు. కానీ బేబక్క మాత్రం ఎక్కువగా రియాక్ట్‌ అవ్వలేదు. కిచెన్‌ లో వాతావరణం మొదటి రోజే వేడి ఎక్కింది. రేషన్ ను బిగ్‌ బాస్ పంపించడంతో అంతా సంతోషంగా గంతులు వేశారు.

కెప్టెన్‌ లకు బదులుగా ముగ్గురు చీఫ్ లు ఉంటారని ప్రకటించిన బిగ్ బాస్, షో ప్రారంభం రోజు టాస్క్‌ లు గెలిచిన నిఖిల్‌, యష్మి, శేఖర్‌ బాషా, పృథ్వీ, నైనిక, బేబక్క ఆ చీఫ్‌ పదవి కోసం టాస్క్‌ నిర్వహించాడు. అందులో మొదటి టాస్క్‌ గా పట్టుకుని ఉండండి - వదలకండి ఇచ్చాడు. ఆ టాస్క్‌ లో నిఖిల్‌ గెలిచి మొదటి చీఫ్ గా ఎంపిక అయ్యాడు. ఆ తర్వాత టాస్క్ లో గట్టి పోటీని ఇచ్చిన డాన్సర్‌ నైనిక గెలిచి రెండో చీఫ్ గా ఎంపిక అయ్యింది. ఇద్దరు చీఫ్‌ లు కలిసి మూడో చీఫ్ ను ఎంపిక చేసుకోవాల్సిందిగా బిగ్‌బాస్ ఆదేశించాడు. సుదీర్ఘ మంతనాల తర్వాత యష్మి ని చీఫ్ గా ఎంపిక చేయడం జరిగింది.

నిఖిల్, నైనికల నిర్ణయాన్ని వర్మ హీరోయిన్‌ సోనియా తప్పుబట్టింది. ఆమెతో ఉన్న స్నేహం కారణంగానే యష్మిని ఎంపిక చేశారు. ఆమె కంటే చాలా స్ట్రాంగ్‌ అయిన వారిని, చీఫ్ గా మంచి క్వాలిటీ ఉన్న వారిని పక్కన పెట్టారు అంటూ అసహనం వ్యక్తం చేసింది. సోనియా ఆ సమయంలో ఫైర్‌ బ్రాండ్‌ గా తన వాదన వినిపించింది. ఆమె తీరు చూస్తూ ఉంటే ముందు ముందు ఆమె నుంచి స్ట్రాంగ్ కంటెంట్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సోనియా తనను టార్గెట్‌ చేయడంతో యష్మి అసహనం వ్యక్తం చేసింది. నువ్వు నన్ను ఎందుకు టార్గెట్‌ చేస్తున్నావు అంటూ వాదనకు దిగింది. ఇద్దరి మధ్య కాస్త సీరియస్ గానే చర్చ జరిగింది. చివరకు యష్మి మూడో చీఫ్ గా ఎంపిక అయ్యింది. మొదటి రోజే హౌస్‌ లో టాస్క్ వల్ల రచ్చ రచ్చ చేశారు. ముందు ముందు ఎలా ఉంటుందో చూడాలి.

Tags:    

Similar News