బిగ్ బాస్ 8 హోస్ట్ ఆయనే.. ఈ మార్పు ఎందుకు..?

ఈసారి నాగార్జునకు బదులుగా వేరే హోస్ట్ ని తీసుకుంటారని తెలుస్తుంది. ఇప్పటికే రేసులో చాలామంది సెలబ్రిటీస్ ఉండగా ఫైనల్ గా నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేసే అవకాశం ఉందని టాక్.

Update: 2023-12-25 13:30 GMT

బిగ్ బాస్ సీజన్ 7 సక్సెస్ ఫుల్ గా పూర్తైంది. సీజన్ 7 విన్నర్ గా కామన్ మ్యాన్ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ గెలిచాడు. ఎప్పుడు లేనిది ఈ సీజన్ పూర్తయ్యాక జరిగిన హడావిడి తెలిసిందే. ఇక బిగ్ బాస్ సీజన్ 7 తర్వాత మరో రెండు నెలల్లోనే బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ 2 ని మొదలు పెట్టాలని చూస్తున్నారు. బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్ విన్నర్ గా బిందు మాధవి గెలిచింది. ఓటీటీ సీజన్ పై ఆడియన్స్ అంతగా ఆసక్తి చూపించలేదు. అందుకే లాస్ట్ ఇయర్ ఓటీటీ సీజన్ ను చేయలేదు. అయితే సీజన్ 7 సక్సెస్ అవ్వడంతో బిగ్ బాస్ ఓటీటీ సెకండ్ సీజన్ ను కూడా స్టార్ట్ చేయాలని చూస్తున్నారు.


ఫిబ్రవరి, మార్చి నుంచే బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2 స్టార్ట్ అవుతుందని టాక్. ఇదిలా ఉంటే బిగ్ బాస్ సీజన్ 8 గురించి ఇప్పటికే హోస్ట్ విషయంలో క్లారిటీ వచ్చేసింది. ఈసారి హోస్ట్ గా నాగార్జున చేయరని టాక్. బిగ్ బాస్ సీజన్ 1 ఎన్.టి.ఆర్, సీజన్ 2 నాని హోస్ట్ గా చేయగా సీజన్ 3 నుంచి కింగ్ నాగార్జున ఒంటి చేత్తో బిగ్ బాస్ ని లాక్కొస్తున్నారు. మధ్యలో నాగార్జున హోస్ట్ గా చేయనని చెప్పినా బిగ్ బాస్ నిర్వాహకులు నాగార్జున అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చి మరి ఆయన కొనసాగేలా చేశారు.

సీజన్ 8 విషయంలో మేకర్స్ కూడా ప్లాన్ మార్చేస్తున్నారని తెలుస్తుంది. ఈసారి నాగార్జునకు బదులుగా వేరే హోస్ట్ ని తీసుకుంటారని తెలుస్తుంది. ఇప్పటికే రేసులో చాలామంది సెలబ్రిటీస్ ఉండగా ఫైనల్ గా నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేసే అవకాశం ఉందని టాక్. బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో సూపర్ సక్సెస్ అవడంతో హోస్ట్ గా నాగార్జున కూడా అదుర్స్ అనేలా చేసుకున్నారు.

ఇక ఇప్పుడు బిగ్ బాస్ టీం కూడా బిగ్ బాస్ సీజన్ 8 కి హోస్ట్ గా నాగార్జునకి బదులుగా బాలకృష్ణని తీసుకుంటే బెటర్ అని భావిస్తున్నారట. బాలకృష్ణ హోస్ట్ గా బిగ్ బాస్ చేస్తే మాత్రం హౌస్ మెట్స్ కి హడలే అని చెప్పొచ్చు. మామూలుగానే తనకు నచ్చని పని చేస్తే ముక్కుసూటిగా చెప్పే బాలయ్య బిగ్ బాస్ హోస్ట్ గా చేస్తే కంటెస్టెంట్స్ ని కడిగిపారేయడం పక్కా అని చెప్పొచ్చు. మరి నిజంగానే నాగార్జున బదులుగా బాలకృష్ణ బిగ్ బాస్ హోస్ట్ గా వస్తారా లేదా అన్నది త్వరలో క్లారిటీ వస్తుంది.

Tags:    

Similar News