బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఎమ్మెల్యే..?
బిగ్ బాస్ సీజన్ 7 హడావిడి ఓ రేంజ్ లో ఉంది. ఐదు వారాల బిగ్ బాస్ తర్వాత సీజన్ 7 లో 2.0 అంటూ మరో ఐదుగురిని హౌస్ లోకి పంపించారు
బిగ్ బాస్ సీజన్ 7 హడావిడి ఓ రేంజ్ లో ఉంది. ఐదు వారాల బిగ్ బాస్ తర్వాత సీజన్ 7 లో 2.0 అంటూ మరో ఐదుగురిని హౌస్ లోకి పంపించారు. ఆదివారం జరిగిన ఈ స్పెషల్ ఎపిసోడ్ స్టార్ మా కి మంచి రేటింగ్ తెచ్చింది. ఓ పక్క ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ జరుగుతుండగా బిగ్ బాస్ సీజన్ 7 2.ఓ ని కూడా ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు. ఆదివారం ఎపిసోడ్ లో చిన్నా ప్రమోషన్స్ కోసం సిద్ధార్థ్ హౌస్ లోకి వెళ్లాడు.
ఆ తర్వాత టైగర్ నాగేశ్వర రావు కోసం రవితేజ తన సినిమా హీరోయిన్స్ తో బిగ్ బాస్ స్టేజ్ మీద అలరించారు. ఇదిలా ఉంటే తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 లాస్ట్ మంత్ మొదలవగా దీనితో పాటు లేటెస్ట్ గా తమిళ, కన్నడ భాషల్లో కూడా బిగ్ బాస్ మొదలైంది. బిగ్ బాస్ తమిళం సీజన్ 7 లాస్ట్ వీక్ మొదలైంది. లాస్ట్ సండే భారీ ఈవెంట్ గా బిగ్ బాస్ సీజన్ 7 మొదలైంది. ఎప్పటిలానే లోక నాయకుడు కమల్ హాసన్ ఈ సీజన్ ని హోస్ట్ చేస్తున్నారు.
ఇక నిన్న సండే బిగ్ బాస్ కన్నడ మొదలైంది. ఆల్రెడీ అక్కడ 8 సక్సెస్ ఫుల్ సీజన్లు పూర్తి చేసుకోగా లేటెస్ట్ గా బిగ్ బాస్ కన్నడ సీజన్ 9 మొదలైంది. కన్నడ బిగ్ బాస్ ను అక్కడ స్టార్ హీరో సుదీప్ హోస్ట్ చేస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 9 కన్నడ సండే గ్రాండ్ గా మొదలైందిక్. అయితే హోస్ట్ కంటెస్టెంట్స్ అందరినీ స్టేజ్ మీదకు ఆహ్వానించి హౌస్ లోకి పంపించారు. కన్నడ బిగ్ బాస్ లో ప్రజానేత కర్ణాటక ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ కూడా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చారు.
ఒక ప్రజాప్రతినిధి అయ్యుండి ప్రజల సమస్యల కోసం పోరాడకుండా ఇలా బిగ్ బాస్ హౌస్ కి వెళ్లడమేనని బీజేపీ నేతలు ప్రదీప్ ఈశ్వర్ ని విమర్శిస్తున్నారు. ప్రదీప్ ఈశ్వర్ మాత్రమే కాదు కన్నడ బిగ్ బాస్ లో 777 చార్లీ సినిమాలో నటించిన డాగ్ కూడా ఒక కంటెస్టెంట్ గా వెళ్లినట్టు తెలుస్తుంది. మొత్తానికి బిగ్ బాస్ కన్నడ సంథింగ్ స్పెషల్ గా ఉండబోతుందని చెప్పొచ్చు.