వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. పేమెంట్ ఫుల్..!
ఐదో వారం వారు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినా బిగ్ బాస్ టీం వారికి మొదటి వారం నుంచి రెమ్యూనరేషన్ ఇస్తారట.
బిగ్ బాస్ షోలో మొదటి నుంచి ఆట ఆడే వారు కొందరైతే.. సడెన్ గా వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటూ మరికొంతమంది వస్తారు. ఆల్రెడీ నాలుగు ఐదు వారాలు ఆట ఆడిన వారు కొందరు అప్పుడే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన వారు మరికొందరు. అలా ఆట రసవత్తరంగా సాగుతుంది. అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన వారికి గెలుపు శాతం చాలా తక్కువ అని చెప్పొచ్చు. అలా ఎందుకు అంటే ఐదు వారాల తర్వాత హౌస్ లోకి వస్తున్నారు అంటే అప్పటికే హౌస్ లో కొందరు స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా మారుతారు.
అంతేకాదు నామినేషన్స్ లో వస్తే వైల్డ్ కార్డ్ ఎంట్రీ కదా వారి ఆట మీద వారి మీద అంత అంచనా ఉండదు. అందుకే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన వారు అంత గొప్ప ఆట తీరుని ప్రదర్శించిన సందర్భాలు లేవు. ఏదో నవదీప్ లాంటి కొందరు వైల్డ్ కార్డ్ లో అలా మెరిసారు. ఈ సీజన్ లో కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గా ఐదుగురు హౌస్ లోకి వచ్చారు.
వారిలో లేటెస్ట్ గా ఎలిమినేట్ అయిన అశ్వినిని తీసేస్తే మిగిలింది కేవలం అర్జున్ ఒక్కడే. అయితే ఈమధ్య వైల్డ్ కార్డ్ ఎంట్రీ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వగా వారి రెమ్యునరేషన్ గురించి అసలు సీక్రెట్ బయట పెట్టాడు. ఐదో వారం వారు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినా బిగ్ బాస్ టీం వారికి మొదటి వారం నుంచి రెమ్యూనరేషన్ ఇస్తారట. ఐదో వారం వచ్చిన అశ్విని ఈ వారం ఎలిమినేట్ అయ్యింది సో ఆమెకు మొదటి నుంచి ఇప్పటివరకు జరిగిన 12 వారాల రెమ్యునరేషన్ మొత్తాన్ని ఇస్తారట.
సో అలా చూసుకుంటే ఫస్ట్ టైం హౌస్ లోకి వచ్చే వారికంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చే వారికే మంచి బెనిఫిట్స్ అని చెప్పొచ్చు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రెమ్యునరేషన్ విషయంలో ఆడియన్స్ కూడా షాక్ అవుతున్నారు. మరి ఈ సీజన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అర్జున్ టాప్ 5 దాకా ఉంటే 15 వారాల రెమ్యునరేషన్ అందుకుంటాడని చెప్పొచ్చు. టాప్ 5 దాకా వెళ్లకపోయినా అతను మొదటి నుంచి అన్ని వారాల పారితోషికం అందుకుంటాడని తెలుస్తుంది.