నవల ఆధారిత సినిమాలో ఆదిపురుష్ విలన్
ప్రజాదరణ పొందిన నవలల్ని వెండితెరపైకి తేవడం ఇప్పుడే కొత్త కాదు. బాలీవుడ్ లో ఈ తరహా ప్రయత్నాలు గతంలో విజయాలను అందించాయి.;

ప్రజాదరణ పొందిన నవలల్ని వెండితెరపైకి తేవడం ఇప్పుడే కొత్త కాదు. బాలీవుడ్ లో ఈ తరహా ప్రయత్నాలు గతంలో విజయాలను అందించాయి. తాజా సమాచారం మేరకు.. నీలాంజనా ఎస్. రాయ్ రాసిన విమర్శకుల ప్రశంసలు పొందిన 2022 నవల `బ్లాక్ రివర్` వెండితెరకెక్కనుంది.
హన్సల్ మెహతా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆదిపురుష్ ఫేం సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రను పోషిస్తారు. సైఫ్ తో సినిమాని ఇప్పటికే దర్శకుడు హన్సల్ ధృవీకరించారు. అయితే దర్శకుడు ఇప్పటివరకూ ఫలానా నవల ఆధారంగా ఈ సినిమా తీస్తున్నామని వెల్లడించలేదు. ఇప్పుడు రచయిత్రి నీలాంజనా రాయ్ స్వయంగా ఇది తన పుస్తకం `బ్లాక్ రివర్` ఆధారంగా రూపొందుతోందని ధృవీకరించారు. తన రచన సినిమాగా రూపాంతరం చెందుతుండడంపై తాను ఎంత ఉత్సాహంగా ఉన్నారో తెలిపారు.
పీపింగ్ మూన్ కథనం ప్రకారం.. సైఫ్ అలీఖాన్ - హన్సల్ కాంబినేషన్ మూవీ ఖరారైంది. నవల ఆధారిత చిత్రంలో నటిస్తుండడం ఇప్పుడు సైఫ్ అభిమానులను కూడా ఎగ్జయిట్ చేస్తోంది. ఇది ఒక మర్డర్ మిస్టరీ. సైఫ్ ఖాన్ స్వయంగా నవల హక్కులను పొందాడు. ఈ చిత్రంలో నటించడమే కాకుండా అతడు స్వయంగా దీనిని హన్సల్ మెహతా నిర్మాణ సంస్థ ట్రూ స్టోరీ ఫిల్మ్స్‌తో కలిసి నిర్మించనున్నాడు. ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉంది. హన్సల్ మెహతా, అతడి బృందం స్క్రిప్ట్‌పై పని చేస్తున్నారు. 2026 మధ్యలో సినిమా చిత్రీకరణ ప్రారంభమవుతుంది.
`బ్లాక్ రివర్` కథ ఢిల్లీ సమీపంలోని ఒక చిన్న గ్రామంలో ఎనిమిదేళ్ల బాలిక హత్య, ఆ తర్వాత జరిగే దర్యాప్తు చుట్టూ తిరుగుతుంది. ఈ పుస్తకం న్యాయం కళ్లు కప్పడం, మత వివక్షత, వలస పోరాటాలు, అవినీతి సహా చాలా సామాజిక అంశాలను స్పర్శిస్తుంది. ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్ హత్యను దర్యాప్తు చేయడానికి నియమితుడైన అధికారి ఓంబిర్ సింగ్ పాత్రను పోషిస్తారు. నటుడు -దర్శకుడు హన్సల్ మెహతా నవల ప్రధాన ఇతివృత్తాన్ని కాపాడటానికి స్క్రిప్ట్‌ను జాగ్రత్తగా రూపొందిస్తున్నామని తెలిపారు. ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా దీనిలోని ఎమోషనల్ ఘట్టాలను చిత్రీకరించాలని దర్శకుడు ప్రయత్నిస్తున్నారు.
సైఫ్ అలీ ఖాన్ తదుపరి వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం రాహుల్ ధోలాకియా తెరకెక్కిస్తున్న నెట్‌ఫ్లిక్స్ చిత్రం కోసం షూటింగ్ చేస్తున్నాడు. ఈ ఏప్రిల్ 25న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్ అయ్యే `జ్యువెల్ థీఫ్`లో కూడా అతను కనిపిస్తాడు. `రేస్ 4`లోను అతడు నటిస్తున్నాడు.