డాకు డైరెక్టర్.. దుమ్ములేపే కాంబో..!

వాల్తేరు వీరయ్య తర్వాత రెండేళ్లు టైం తీసుకుని మళ్లీ సంక్రాంతికి బాలకృష్ణతో డాకు మహారాజ్ సినిమా చేశాడు డైరెక్టర్ బాబీ కొల్లి.

Update: 2025-01-18 01:30 GMT

వాల్తేరు వీరయ్య తర్వాత రెండేళ్లు టైం తీసుకుని మళ్లీ సంక్రాంతికి బాలకృష్ణతో డాకు మహారాజ్ సినిమా చేశాడు డైరెక్టర్ బాబీ కొల్లి. బాలయ్యతో సంక్రాంతికి వచ్చి మరో సక్సెస్ అందుకున్నాడు ఈ డైరెక్టర్. డాకు మహారాజ్ సినిమా చూసిన నందమూరి ఫ్యాన్స్ అంతా కూడా బాబీ టేకింగ్ గురించి స్పెషల్ గా చెప్పుకుంటున్నారు. కథ కాస్త రెగ్యులర్ గా అనిపించినా కథనం ఇంకా బాబీ యాక్షన్ బ్లాక్స్ ప్లానింగ్ సినిమాపై మంచి పట్టు సాధించేలా చేశాయి. బాలయ్య ఊర మాస్ ఊచకోతని వేరే పంథాలో చూపించారు.

అందుకే డైరెక్టర్ గా బాబీకి సూపర్ హిట్ మార్కులు పడ్డాయి. ఐతే డాకు మహారాజ్ తర్వాత బాబీ నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తాడన్నది ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. డాకు మహారాజ్ సినిమా తర్వాత బాబీ లైన్ లో ఇద్దరు స్టార్స్ ఉన్నట్టు తెలుస్తుంది. అందులో అతనికి డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చిన మాస్ మహారాజ్ రవితేజ ఒకడు కాగా.. మరొకరు విక్టరీ వెంకటేష్ అని తెలుస్తుంది.

రవితేజ తో పవర్ సినిమాతోనే బాబీ డైరెక్టర్ గా మారాడు. అంతకుముందు రైటర్ గా పనిచేసిన అతను డైరెక్టర్ గా పాస్ అయ్యాడు. ఇక అప్పటి నుంచి బాబీ సినిమా అంటే సంథింగ్ స్పెషల్ అనిపించేలా చేశాడు. ఐతే డాకు మహారాజ్ తర్వాత బాబీ వెంకటేష్ తో చేస్తే వారి కాంబోలో రెండో సినిమా అవుతుంది. అదే రవితేజతో చేస్తే మాత్రం 3వ సినిమా అవుతుంది. సో ఈ ఇద్దరితో ఎవరితో సినిమా చేసినా సరే బాబీ మరోసారి బాక్సాఫీస్ షేక్ చేస్తాడని చెప్పొచ్చు.

ఆల్రెడీ వెంకటేష్ తో వెంకీ మామ చేసిన బాబీ.. రవితేజతో పవర్, వాల్తేరు వీరయ్య సినిమా చేశాడు. మరి ఈ ఇద్దరి హీరోల్లో బాబీ వెంటనే ఎవరితో సినిమా ఫిక్స్ చేసుకుంటాడు అన్నది చూడాలి. వెంకటేష్ అయితే సంక్రాంతికి వస్తున్నాం హిట్ జోష్ లో ఉన్నాడు. సో ఈ కాంబో సెట్ అయితే మళ్లీ మరో సూపర్ హిట్ లైన్ లో పెట్టే ఛాన్స్ ఉంటుందని చెప్పొచ్చు. డాకు మహారాజ్ సినిమా తో మరోసారి తన డైరెక్షన్ టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకున్న బాబీ రాబోతున్న సినిమాలతో మరో క్రేజీ అటెంప్ట్ చేయనున్నాడు.

Tags:    

Similar News