చిరంజీవి.. బాలకృష్ణ.. ఇద్దరిలో ఎవరు..?

టాలెంటెడ్ డైరెక్టర్ కె ఎస్ బాబీ ఈమధ్యనే బాలకృష్ణతో డాకు మహారాజ్ అంటూ ఒక సూపర్ హిట్ సినిమా చేశాడు.

Update: 2025-02-04 03:58 GMT

టాలెంటెడ్ డైరెక్టర్ కె ఎస్ బాబీ ఈమధ్యనే బాలకృష్ణతో డాకు మహారాజ్ అంటూ ఒక సూపర్ హిట్ సినిమా చేశాడు. బాలయ్య మార్క్ మాస్ ని తన టేకింగ్ లో ఎలా ఉంటుందో చూపించి నందమూరి ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేశాడు బాబీ. అంతకుముందు రైటర్ గా పనిచేసిన బాబీ పవర్ నుంచి డైరెక్టర్ గా మారి తన మార్క్ సెట్ చేస్తూ వచ్చాడు. రెండేళ్ల క్రితం మెగాస్టార్ చిరంజీవితో వాల్తేరు వీరయ్య సినిమా చేసిన బాబీ బాలయ్యతో డాకు మహారాజ్ తో వచ్చాడు. ఐతే బాబీ నెక్స్ట్ సినిమా కూడా చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరిలో ఒకరితో ఉంటుందని తెలుస్తుంది.

మెగాస్టార్ అభిమాని అయిన బాబీ ఆయనతో సినిమాలు చేయడానికి ఎప్పుడూ రెడీ అంటున్నాడు. ఐతే ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర పూర్తి చేయగా త్వరలో అనిల్ రావిపూడితో సినిమా చేసే ప్లానింగ్ లో ఉన్నాడు. ఐతే అనిల్ సినిమాతో పాటు ఉంటే బాబీ సినిమా కూడా పార్లర్ గా తీసే ఛాన్స్ ఉంటుంది. అలా కాదు అనుకుంటే మాత్రం అనిల్ సినిమా పూర్తి చేశాక బాబీ సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది.

ఇక బాలకృష్ణతో బాబీ అంటే ప్రస్తుతం అఖండ 2 తో బిజీగా ఉన్న బాలయ్య ఆ నెక్స్ట్ గోపీచంద్ మలినేనితో ఫిక్స్ అయ్యాడు. ఆ సినిమా అయ్యాక కానీ బాబీ సినిమా లైన్ లోకి వస్తుంది. సో చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరిలో ఎవరు ఫ్రీగా ఉంటే వారితో బాబీ సినిమా చేసే అవకాశం ఉంటుంది. ఐతే ఈ ఇద్దరు కాకుండా మరో హీరో అంటే మాత్రం బాబీకి దొరకడం కష్టమని చెప్పొచ్చు. ఎందుకంటే దాదాపు స్టార్ హీరోలంతా 3, 4 ఏళ్లు కెరీర్ ప్లానింగ్ ఆల్రెడీ సెట్ చేసుకుని ఉన్నారు.

ఒకవేళ బాబీ ఖాళీ లేకుండా చేయాలి అనుకుంటే మాత్రం యువ హీరోలతో వెళ్లాల్సి ఉంటుంది. మరి మెగా డైరెక్టర్ ఏం ఆలోచిస్తున్నాడు అన్నది తెలియాల్సి ఉంది. ఈసారి చిరు, బాలయ్య తన హీరో ఎవరైనా నెక్స్ట్ సినిమా వేరే లెవెల్ లో ప్లాన్ చేస్తున్నాడట బాబీ. మరి అది ఏంటన్నది సినిమా సెట్స్ మీదకు వెళ్లినప్పుడు తెలుస్తుంది.

Tags:    

Similar News