డాకు కాంబో ఫిక్స్ అయినట్టేనా..?

మాస్ యాక్షన్ సినిమాల్లో తన ప్రత్యేకత చాటుతూ వస్తున్న బాబీ డాకు తో కూడా తన మార్క్ సక్సెస్ అందుకున్నాడు.

Update: 2025-01-24 20:30 GMT

స్టార్ హీరోకి ఒక సినిమా హిట్ ఇస్తే చాలు ఆ డైరెక్టర్ తో మళ్లీ మళ్లీ సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. సీనియర్ హీరోలైతే పర్ఫెక్ట్ సింక్ కుదిరితే మాత్రం ఆ డైరెక్టర్ ని వదిలి పెట్టకుండా సినిమాలు చేస్తూనే ఉంటారు. బాలకృష్ణ బోయపాటి శ్రీను లాగా ఆ కాంబో సినిమా ఎప్పుడొచ్చినా సంథింగ్ స్పెషల్ అనిపించేలా చేస్తాయి. లేటెస్ట్ గా డాకు మహారాజ్ తో బాలకృష్ణకు సూపర్ హిట్ ఇచ్చాడు డైరెక్టర్ బాబీ. మాస్ యాక్షన్ సినిమాల్లో తన ప్రత్యేకత చాటుతూ వస్తున్న బాబీ డాకు తో కూడా తన మార్క్ సక్సెస్ అందుకున్నాడు.

డాకు మహారాజ్ సినిమాలో కొత్త బాలయ్యని చూపించడానికి బాబీ చేసిన హోం వర్క్ నందమూరి ఫ్యాన్స్ ని ఇంప్రెస్ చేసింది. అంతేకాదు ఒక మెగా అభిమానిగా బాలకృష్ణతో పనిచేసిన బాబీ ఆయన ఫాలోవర్ గా మారిపోయాడు. రీసెంట్ గా జరిగిన సక్సెస్ సెలబ్రేషన్స్ లో బాలయ్య గురించి బాబీ చెప్పిన మాటలు విన్న ఎవరైనా సర్ ప్రైజ్ అవ్వాల్సిందే. తనతో పనిచేసిన దర్శకులకు తన క్లోజ్ సర్కిల్స్ కు బాలకృష్ణ మంచి మనసు అర్థమవుతుంది.

ఇదిలా ఉంటే డాకు మహారాజ్ సక్సెస్ సెలబ్రేషన్స్ లోనే డైరెక్టర్ బాబీ బాలకృష్ణతో మళ్లీ మళ్లీ సినిమాలు చేస్తానని చెప్పాడు. థమన్ కి ఆల్రెడీ నందమూరి ఇంటి పేరు వచ్చింది తాను కూడా రెండు మూడు సినిమాలు తీసి అది సాధిస్తా అని సరదాగా అన్నాడు బాబీ. చూస్తుంటే బాబీ త్వరలోనే మరోసారి బాలకృష్ణతో పనిచేసే ఛాన్సులు ఉన్నట్టు తెలుస్తుంది.

స్వతహాగా రైటర్ కాబట్టి బాలకృష్ణ కోసం కథ రాయడానికి కూర్చుంటే చాలు మరో మంచి లైన్ సిద్ధం చేస్తాడు. బాలయ్య కూడా ఆల్రెడీ హిట్ ఇచ్చిన డైరెక్టర్ కాబట్టి డాకు డైరెక్టర్ తో మళ్లీ సినిమా చేసేందుకు రెడీ అనేస్తాడు. ప్రస్తుతం అఖండ 2 చేస్తున్న బాలకృష్ణ నెక్స్ట్ సినిమా గోపీచంద్ మలినేనితో ఉంటుందని టాక్. ఆ తర్వాత బాబీ తో ట్రై చేసే ఛాన్స్ ఉంది. డాకు కాంబో రిపీట్ అయితే మాత్రం నందమూరి ఫ్యాన్స్ కి మరో సూపర్ హిట్ మూవీ వచ్చేస్తుందని చెప్పొచ్చు. గోపీచంద్, బాబీ ఇలా క్రేజీ డైరెక్టర్స్ అంతా కూడా బాలకృష్ణతో సినిమాలు చేసేందుకు లైన్ లో ఉన్నారు.

Tags:    

Similar News