సినిమాల్లో బోల్డ్ కంటెంట్.. ఇది గుణపాఠమే..

సినిమా ప్రపంచంలో ఇటీవల కాలంలో ఎప్పుడూ కొత్తదనం కోసం ప్రయత్నాలు చేసే వారికి అవకాశాలు అందుతూ ఉంటాయి. అలాగే ఆడియెన్స్ ఫోకస్ కూడా వారిపైనే ఉంటుంది. కానీ కొన్ని కొత్త ప్రయోగాలు ఊహించిన దిశలో వెళ్లకపోతే పెద్ద సమస్యగా మారుతాయి.

Update: 2025-02-16 08:33 GMT

సినిమా ప్రపంచంలో ఇటీవల కాలంలో ఎప్పుడూ కొత్తదనం కోసం ప్రయత్నాలు చేసే వారికి అవకాశాలు అందుతూ ఉంటాయి. అలాగే ఆడియెన్స్ ఫోకస్ కూడా వారిపైనే ఉంటుంది. కానీ కొన్ని కొత్త ప్రయోగాలు ఊహించిన దిశలో వెళ్లకపోతే పెద్ద సమస్యగా మారుతాయి. ఒకప్పుడు బోల్డ్ కంటెంట్ అంటే, చిన్న లిప్ లాక్ సీన్స్‌కే ప్రేక్షకులు ఆశ్చర్యపోయేవారు. కానీ ఇప్పుడు ట్రైలర్ల నుంచే డైరెక్ట్ బూతు డైలాగులు, వల్గర్ సన్నివేశాలతో సినిమాలను ప్రచారం చేస్తున్నారు. దీని వల్ల ప్రేక్షకుల అభిరుచి మారిందా? లేక ఈ ట్రెండ్‌ను కొందరు దర్శకులు బలవంతంగా నెత్తికెత్తుకుంటూ పోతున్నారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

గతంలో కొన్ని సినిమాల్లో కొన్ని మితిమీరిన డైలాగులు ఉండేవి. కానీ అవి హాస్యాన్ని పెంచేలా ఉండేవి. ఇప్పుడు మరీ వల్గర్‌గా, అసహ్యంగా ఉండే డైలాగులు, సన్నివేశాలతోనే సినిమాలను నింపేస్తున్నారు. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ అనే పేరుతో ట్రాక్ తప్పుతున్నారన్నారనే అభిప్రాయం పెరుగుతోంది. అందుకు తాజా ఇటీవల ఒక సినిమా వచ్చింది. ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడే చాలా మంది ఆగమాగమయ్యారు. కొన్ని డైలాగులు ట్రైలర్‌లోనే మితిమీరాయి. కానీ అసలు సినిమా చూసినవాళ్ళు అప్సెట్ కూడా అయ్యారు.

ఆ సినిమాకు వస్తున్న ఫలితం పరిశీలిస్తే, బోల్డ్ కంటెంట్ పేరు చెప్పి అసలు కథను వదిలేసి, వల్గారిటీ మీదే అంతా నడిపితే ప్రేక్షకులు ఊహించిన దాని కన్నా భిన్నంగా స్పందిస్తారని స్పష్టమవుతోంది. సినిమాలో కొన్ని డైలాగులు కేవలం ఎట్రాక్షన్ కోసం వేసినట్లు కనిపించాయి. కథతో సంబంధం లేకుండా ఉన్న వీటిని చూసి ప్రేక్షకులు విసిగిపోయారు. మితిమీరిన బూతు డైలాగులు, కామెడీ పేరుతో నీచమైన హాస్యాన్ని ఒత్తిడి చేయడం సినిమాకు పూర్తిగా బెడిసికొట్టింది.

ఒకప్పుడు జబర్దస్త్ వంటి షోల ద్వారా ద్వంద్వార్థ డైలాగులు బాగా పాపులర్ అయ్యాయి. అయితే, వాటిని ఫ్యామిలీ ఆడియన్స్ పూర్తిగా స్వీకరించలేకపోయారు. సినిమాల్లోనూ ఇదే ట్రెండ్‌ను కొందరు దర్శకులు తెచ్చినప్పుడు ప్రేక్షకులు వాటిని తిరస్కరించారు. రీసెంట్ గా వచ్చిన కొన్ని సినిమాలు ఆ పద్ధతిని మరింత దూరం తీసుకెళ్లాయి. యూత్‌ని లక్ష్యంగా చేసుకున్నట్లు అనిపించినా, వారి దగ్గర కూడా ఈ ప్రయోగం ఫ్లాప్ అయ్యిందనే చెప్పాలి.

ఇలాంటి సినిమాలు వరుసగా ప్లాప్ అవడం హీరోలు, దర్శకులకు కూడా పెద్ద గుణపాఠంగా మారే అవకాశం ఉంది. కథ, కంటెంట్ లేకుండా కేవలం షాకింగ్ ఎలిమెంట్స్‌తో సినిమా నడిపిస్తే ప్రేక్షకులు దాన్ని ఎంత వరకు అంగీకరిస్తారనేది ఇప్పుడు తేలిపోయింది. టాలెంట్ ఉన్న హీరోలైతే ఇలాంటి పొరపాట్లు తప్పించుకోవడం మంచిది.

Tags:    

Similar News