'ఆర్‌ఆర్‌ఆర్‌' : 8 నిమిషాల పాత్రకు రూ.35 కోట్ల పారితోషికం!

బాలీవుడ్‌ స్టార్‌ అజయ్ దేవగన్ 8 నిమిషాల పాత్ర కోసం ఏకంగా రూ.35 కోట్ల పారితోషికం దక్కించుకున్న సందర్భం ఒకటి ఉంది.

Update: 2024-09-20 17:30 GMT

టాలీవుడ్ స్టార్స్ ఇతర హీరోల సినిమాల్లో గెస్ట్‌ అప్పియరెన్స్ ఇచ్చేందుకు ఆసక్తి చూపించరు. కానీ బాలీవుడ్ కు చెందిన షారుఖ్ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌, అక్షయ్‌ కుమార్‌, అజయ్ దేవగన్, అమీర్ ఖాన్ ఇలా ప్రతి ఒక్కరు వేరే హీరోల సినిమాల్లో గెస్ట్‌ అప్పియరెన్స్ ఇచ్చేందుకు సిద్ధం అంటారు. కొందరు హీరోలు స్నేహం కోసం గెస్ట్‌ గా నటిస్తే మరి కొందరు హీరోలు పారితోషికం కోసం గెస్ట్‌ లుగా నటించిన దాఖలాలు ఉన్నాయి. పాత్ర చిన్నదైనా, పెద్దది అయినా గెస్ట్‌ గా నటిస్తే ఎక్కువ పారితోషికం అందుకోవడం జరుగుతూ ఉంటుంది. బాలీవుడ్‌ స్టార్‌ అజయ్ దేవగన్ 8 నిమిషాల పాత్ర కోసం ఏకంగా రూ.35 కోట్ల పారితోషికం దక్కించుకున్న సందర్భం ఒకటి ఉంది.

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ లు హీరోలుగా నటించిన 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో కీలక పాత్రలో బాలీవుడ్‌ నటుడు అజయ్ దేవగన్‌ నటించాడు. రామ్‌ చరణ్‌ పోషించిన రామరాజు పాత్రకు తండ్రి గా అజయ్ దేవగన్ కనిపించాడు. ఊరి వాళ్లకు గన్‌ పేల్చడం నేర్పించి స్వాతంత్య్ర పోరాటం కోసం పంపించేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అలాంటి పాత్ర లో అజయ్ దేవగన్ నటించి మెప్పించాడు. అజయ్ స్క్రీన్‌ ప్రజెన్స్ కేవలం 8 నిమిషాలు మాత్రమే. అయినా కూడా సినిమాకు చాలా స్ట్రాంగ్ గా ఆయన నిలిచాడు. సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాడు అనడంలో సందేహం లేదు.

అజయ్ దేవగన్‌ ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో కనిపించింది కొద్ది సమయమే, షూటింగ్ లో పాల్గొన్నది కూడా ఎక్కువ రోజులు కాదు. అయినా కూడా ఆయనకు ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఏకంగా రూ.35 కోట్లను ఇవ్వడం జరిగింది. ఆ స్థాయిలో పారితోషికం ను అందుకున్న వారు హీరోలు తప్ప మరెవ్వరు లేరు. హీరోలు భారీ పారితోషికాలు అందుకోవడం కామన్‌ విషయం. కానీ చాలా తక్కువ నిడివి పాత్ర కోసం అజయ్‌ దేవగన్‌ ఆ స్థాయి పారితోషికం అందుకోవడం అనేది చాలా పెద్ద విషయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మొదట అనుకున్న దాని ప్రకారం ఆర్ఆర్‌ఆర్‌ సినిమాలో అజయ్‌ దేవగన్ పాత్ర కనీసం 20 నిమిషాలు ఉండాలి. ఆ 20 నిమిషాల పాత్ర కోసం ఆయనతో చర్చలు జరిపి రూ.35 కోట్ల పారితోషికం ఒప్పందం చేసుకున్నారు. కానీ సినిమా ఎడిటింగ్‌ వర్షన్‌ లో చాలా వరకు తొలగించడం జరిగింది. అయినా కూడా పారితోషికం మాత్రం అనుకున్న మొత్తంను ఇవ్వడం జరిగింది. ఆలియా భట్‌ పాత్రను కూడా చాలా అనుకుని చివరకు చాలా తక్కువ నిడివి తో ఉన్న పాత్ర గా రూపొందించడం జరిగింది. నిమిషానికి 4.5 కోట్ల రూపాయల చొప్పున పారితోషికం తీసుకున్న అజయ్ దేవగన్ అరుదైన రికార్డ్‌ ను సొంతం చేసుకున్నాడు.

Tags:    

Similar News