12000 పాఠశాలలు..3400 కోట్లు.. స్టార్ హీరో బిగ్ గ్యాంబ్లింగ్
వివేక్ ఒబెరాయ్ దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు రుణాలు అందించే మనీ లెండింగ్ వ్యాపారాన్ని సృష్టించడం మా కీలక విజయాలలో ఒకటి అని వెల్లడించాడు.
బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ఒక స్టార్ మాత్రమే కాదు.. అతడు ఫక్తు బిజినెస్‌మేన్. షేర్ మార్కెట్ నుంచి రియల్ వ్యాపార రంగం నుంచి అతడు టచ్ చేయనిది లేదు. అతడు వందల వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాలను విస్తరించడం ఇటీవల చర్చనీయాంశంగా మారింది.
వ్యాపారంలో అతడి నైపుణ్యం సినీవర్గాల్లోను చర్చగా మారుతోంది. ఇప్పుడు అతడు తన వ్యాపార సామ్రాజ్యాన్ని విద్యారంగంలోను విస్తరిస్తున్నారు. విద్యార్థి-కేంద్రీకృత సేవలపై వ్యూహాత్మక దృష్టితో భారీ వెంచర్ ప్లాన్ చేసాడు. విద్యా రుణాలను ఇవ్వడం ద్వారా తన వ్యాపారం విలువను రూ. 3,400 కోట్లకు పెంచుకోగలిగామని తెలిపారు. బలమైన సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమేనని అతడు చెబుతున్నాడు.
సినిమాల నుంచి వ్యాపారం వైపు వివేక్ ఒబెరాయ్ ప్రయాణం...పరిశీలిస్తే ఎన్నో ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. ఇటీవల ముంబైలో జరిగిన ఒక ఈవెంట్‌లో వివేక్ సినిమా పరిశ్రమలో పక్కకు తప్పుకోవాల్సిన స్థితిలో అతడు తన వ్యవస్థాపక వ్యాపార ప్రయాణం ఎలా ప్రారంభమైందో తెలిపారు. వ్యాపారమే ఎల్లప్పుడూ తన `ప్లాన్ బి` అని, తన విలువలకు భంగం కలగకుండా నటనలో అభిరుచిగా కొనసాగిస్తానని అన్నాడు. తనకు వ్యాపారం జీవనోపాధి అయితే సినీరంగం అభిరుచి అని అన్నారు.
వివేక్ ఒబెరాయ్ దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు రుణాలు అందించే మనీ లెండింగ్ వ్యాపారాన్ని సృష్టించడం మా కీలక విజయాలలో ఒకటి అని వెల్లడించాడు. వాణిజ్యపరంగా లాభాలు తీసుకోవడంతో పాటు సామాజానికి ఏదైనా సాయం చేస్తున్న భావన తనకు కలిగిందని ఒబెరాయ్ అన్నాడు. అతడు విద్యా రుణాలపై దృష్టి సారించే ఒక స్టార్టప్‌ను ప్రారంభించారు. ఇది వేగంగా ఒక భారీ సంస్థగా ఎదిగింది. B2B నెట్‌వర్క్ ద్వారా 12,000 పైగా పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు రుణాలు అందిస్తున్నట్టు ఒబెరాయ్ వెల్లడించారు.
అతడి కంపెనీ డైరెక్ట్-టు-కస్టమర్ మోడల్‌ని అనుసరించింది. 4.5 మిలియన్ల కంటే ఎక్కువ మంది విద్యార్థులతో కూడిన విస్తారమైన డేటాబేస్‌ను సేకరించింది. నిజానికి ఈ కస్టమర్ డేటా ఒక గోల్డ్‌మైన్‌గా మారింది. ఒబెరాయ్ తన కంపెనీ విలువను సుమారు 3400 కోట్ల (400 మిలియన్ డాలర్ల)కు ఎదగడానికి సహకరించింది. విద్యార్థి-కేంద్రీకృత వ్యాపార నమూనా అతడిని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రోల్ మోడల్‌గా మార్చాయి.