ఇప్పటికి మైండ్ యూనివర్శల్ అయింది!
ఇటీవల హిందీ అగ్ర హీరోలు పూర్తిగా తెలుగు మార్కెట్ పై గురి పెడుతున్నారు.
దివంగత సూపర్ స్టార్ కృష్ణ చెప్పినట్టుగా.. పరిశ్రమలో ఏదో జరుగుతోంది. పరిశీలిస్తే.. ప్రతి ఐదేళ్ల కోసారి సినీపరిశ్రమలో ఏదో కొత్త మ్యాజిక్ జరుగుతోంది. ప్రతి పెద్ద విజయం తర్వాత సినీపరిశ్రమలో చాలా మార్పులు మొదలవుతున్నాయి. బాహుబలి తర్వాత.. ఇప్పుడు కల్కి 2989 ఏడి తర్వాత.. ఇంకా టాలీవుడ్ లో అనూహ్య మార్పులు చూడబోతున్నాం. భారతీయ సినిమా మార్కెట్ శైలిలో మార్పును ఇప్పుడు చాలా స్పష్ఠంగా చూస్తున్నాం.
ఇటీవల హిందీ అగ్ర హీరోలు పూర్తిగా తెలుగు మార్కెట్ పై గురి పెడుతున్నారు. తాము సౌత్ లో పాగా వేయకపోతే సౌత్ నుంచి దూసుకొస్తున్న పాన్ ఇండియా స్టార్లను రేసులో వెనక్కి నెట్టలేమని గ్రహించారు. అందుకే ఇప్పుడు మార్పు అనివార్యంగా భావిస్తున్నారు హిందీ తారలు.
ఖాన్ ల త్రయం ఇప్పటికే ఈ విషయాన్ని పసిగట్టారు. అలాగే ఇతర అగ్ర హీరోలు కూడా తెలుగు మార్కెట్ పై గురి పెట్టారు. అందులో ముఖ్యంగా ఆలియా భట్, రణబీర్ కపూర్ ముందు వరుసలో ఉన్నారు. ఇంతకుముందు బ్రహ్మాస్త్ర సినిమాని తెలుగు మార్కెట్లో రిలీజ్ చేయడమే గాక, ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ నగరాల్లో ప్రచారం చేసారు. నెమ్మదిగా తెలుగు వారిలో ఫాలోయింగ్ తెచ్చుకోవాలనే తపన కనిపిస్తోంది. రణవీర్ - ఆలియా జంట బ్రహ్మాస్త్ర ఆశించిన రేంజుకు వెళ్లకపోయినా కానీ, వారు పరిచయం అయ్యారు. ఆర్.ఆర్.ఆర్ సీతగా ఆలియా తెలుగు లోగిళ్లలో మరింత చేరువైంది. యానిమల్ చిత్రంతో తెలుగు వారిలో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు రణవీర్.
ఇక ఇదే అదనుగా ఒక్కో అడుగు వేగంగా వేసేందుకు ఈ జంట ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇప్పుడు ఆలియా తన జిగ్రా సినిమాను తెలుగు మార్కెట్లోను విడుదల చేస్తున్నారు. తెలుగు ట్రైలర్ ఇంటెన్స్ గా ఆకట్టుకుంది. ఆలియా ప్రచారానికి ఇక్కడికి వస్తుందని భావిస్తున్నారు. ఈనెల 11న విడుదల కానున్న ఈ సినిమాపై అంచనాలున్నాయి.
ఇదే సరైన సమయం:
అయితే ఆలియా-రణబీర్ అయినా, ఖాన్ ల త్రయం అయినా, లేదా ఎవరైనా ఇతర భాషల హీరోలు అయినా, తెలుగు మార్కెట్ ని లేదా సౌతిండియా మార్కెట్ ని లైట్ తీసుకోవడం సరికాదని పరిణామాలు చెబుతున్నాయి. ఈ స్టార్లు ఇంతకుముందు కూడా యూనివర్శల్ అప్పీల్ ఉన్న ఎన్నో సినిమాల్లో నటించారు. కానీ వాటిని సౌతిండియా మార్కెట్లో విడుదల చేయాలని అనుకోలేదు. దానివల్ల వారికి కొంత నష్టం వాటిల్లింది. ఇకపోతే ప్రజల్లో మార్పు గతంతో పోలిస్తే, ఇప్పుడు అనూహ్యంగా ఉంది గనుక.. ఇక ఏ స్టార్ కి అయినా పాన్ ఇండియా మార్కెట్లో ప్రవేశించేందుకు ఇదే సరైన సమయం అని కూడా అవగతమవుతోంది.