అలలపై సర్ఫింగ్ కోసం రెడీ అయిన మానుషి
తాజాగా మానుషి స్టన్నింగ్ ఫోటోషూట్ ఇంటర్నెట్‌లో వైరల్ గా మారింది.
మానుషి చిల్లర్ పరిచయం అవసరం లేదు. అక్షయ్ లాంటి స్టార్ హీరోతో బ్యాక్ టు బ్యాక్ అవకాశాలు అందుకుంది ఈ బ్యూటీ. ఇటీవల బిగ్ బడ్జెట్ చిత్రం `బడే మియాన్ చోటే మియాన్` డిజాస్టర్ అవ్వడం, అంతకుముందు కూడా పృథ్వీరాజ్ సినిమా డిజాస్టర్ అవ్వడం ఈ భామకు పెద్ద నిరాశను మిగిల్చింది. అయితే మానుషి తన పరాజయాలకు కలత చెందక నిరంతరం తన ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉంది.
తాజాగా మానుషి స్టన్నింగ్ ఫోటోషూట్ ఇంటర్నెట్‌లో వైరల్ గా మారింది. సర్ఫింగ్ స్లేట్ పట్టుకుని సముద్రపు అలలపైకి లంఘించడానికి రెడీ అవుతోంది. ఈ ఫోటోగ్రాఫ్‌లో చిట్టి పొట్టి పరికిణీ.. వైట్ టాప్ ధరించిన మానుషి డార్క్ బ్లాక్ కళ్లద్దాలు ధరించి అల్ట్రా స్టైలిష్‌గా కనిపిస్తోంది. బీచ్ పరిసరాల్లో మానుషి వైబ్స్ స్పష్ఠంగా కనిపిస్తున్నాయి. మానుషి లుక్ ఆసమ్ అంటూ ఒక అభిమాని థంబ్స్ అప్ ఇచ్చాడు.
మానుషి అడ్వెంచర్ స్పోర్ట్స్ ని అమితంగా ఇష్టపడుతుంది. కానీ ఇంతటి అందగత్తె అలాంటి రిస్కులు చేయడం అభిమానులకు నచ్చడం లేదు. నా కోసం నేను ప్రేరణ పొందుతాను.. అని చెప్పే మానుషి తదుపరి సినిమా కోసమే వెయిటింగ్. ఈసారి ఏ హీరో అవకాశం ఇస్తాడో చూడాలి. మాజీ ప్రపంచ సుందరిగా గుర్తింపు ఉన్నా కానీ, ఐశ్వర్యారాయ్, సుస్మితా సేన్ రేంజులో ఈ భామకు ఏదీ వర్కవుట్ కాలేదు. ముఖ్యంగా తాను నటించిన సినిమాలేవీ ఆశించిన విజయాల్ని ఇవ్వకపోవడం పెద్ద నిరాశ.