నేషనల్ క్రష్.. ఏం చేసినా సెన్సేషనే..
'పుష్ప 2' రూ.1800 కోట్లకు పైగా వసూలు చేయగా, 'ఛావా' రెండు వారాల్లో రూ.555.3 కోట్లు వసూలు చేసింది.
టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన కొన్ని సంవత్సరాల్లోనే అగ్రస్థాయికి చేరుకున్న హీరోయిన్ రష్మిక మందన్న.. ఇప్పుడు నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకుంది. 'గీత గోవిందం' తర్వాత 'పుష్ప'తో దేశవ్యాప్తంగా తన హవాను కొనసాగించింది. ఇక ఇటీవల 'పుష్ప 2' మాస్ మేనియాతో పాటు, బాలీవుడ్ లో విక్కీ కౌశల్ తో చేసిన 'ఛావా'తో మరోసారి టాప్ స్పాట్ అందుకుంది. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టాయి.
'పుష్ప 2' రూ.1800 కోట్లకు పైగా వసూలు చేయగా, 'ఛావా' రెండు వారాల్లో రూ.555.3 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు రష్మిక తన లేటెస్ట్ ఫోటోషూట్ తో మరోసారి ట్రెండ్ లోకి వచ్చింది. ఈ మధ్య రష్మిక ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫోటోలు నెటిజన్లను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. పసుపు రంగు డ్రెస్సులో, సంప్రదాయమైన లుక్ లో బ్లాక్ & వైట్ ఫోటోషూట్ తో అమ్మడు కొత్తగా మెరిసిపోతోంది.
హాయిగా నవ్వుతూ, పూలను ఉపయోగిస్తూ చేసిన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ ఆమె అందాన్ని మరింత హైలైట్ చేశాయి. ఫొటోలలో కనిపిస్తున్న యెల్లో అవుట్‌ఫిట్ ఆమె గ్లామర్ ను మరింత మెరుగు పరచింది. ఆమె ముఖ కవళికలు, చూపులు నెటిజన్లను ఉర్రూతలూగిస్తున్నాయి. సోషల్ మీడియాలో రష్మిక చేసే ప్రతీ పోస్ట్ వైరల్ అవుతుందనడంలో సందేహం లేదు. ఇప్పుడు ఆమె పోస్ట్ చేసిన ఈ ఫోటోలు లక్షల కొద్దీ లైక్స్, వేల సంఖ్యలో కామెంట్లు సంపాదించుకుంటున్నాయి.
పుష్పరాజ్ శ్రీవల్లి క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్, ఆమె హావభావాలు నెటిజన్లను అలరిస్తున్నాయి. "ఎప్పుడూ లవ్లీ లుక్ తో ఆకట్టుకునే నేషనల్ క్రష్", "ఈ సింప్లిసిటీ నే అందరికీ నచ్చేలా చేస్తుంది" అంటూ కామెంట్స్ విపరీతంగా వస్తున్నాయి. ఇక కెరీర్ విషయానికి వస్తే, రష్మిక ప్రస్తుతం బిజీగా ఉంది. బాలీవుడ్ లో 'సికందర్' అనే సినిమా చేస్తోంది. అలాగే మరికొన్ని లేడీ ఓరియంటెడ్ సినిమాలు లైన్ లో ఉన్నాయి. కెరీర్ పరంగా రష్మిక ఊహించని స్థాయిలో ఎదుగుతూ, వరుసగా బ్లాక్ బస్టర్ సినిమాలు అందుకుంటూ వెండితెరను దుమ్ములేపుతోంది.